కలలు + కల్పనలు = నా కవితలు
ఆమెను చూసింది మొదలు
ఎడారి పాట నా చెవి లో సోకినా
ఈ క్షణం వరకు
నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక
పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో
పదిలపరిచాను .
నా సత్య స్వరుపమా !
బొమ్మలు వేయడం నా చేత కాదు .
చేతనైతే నా కలలను
నా మనోభావాలను
రంగుల చిత్రాల తో
ప్రదిర్శించే వాడిని
ఏ చిత్రకారున్ని
నేనశ్రాయుంచాను,
అందుకు నా మనస్సు సమ్మతించదు.
నా అంతరాత్మా !
ఇవిగో నా శబ్ద చిత్రాలు
నా మనస్సంగం లో
జనించిన ప్రాణ చిత్రలయున
ఏ "కలలు + కల్పనలు = నా కవితలు "
నీ పదాల చెంత ఉంచుతున్నాను .
-ముజీఫ్
Sunday, December 13, 2009
ఆమె నేను - రెండు దృశ్యాలు
దృశ్యం-1 మొదటిసారిఆమెను కలసినప్పుడునీటి చెలమనుకున్నానుసంవత్సరాలుగా తోడిన నీటిలోమునిగిన చెరువయ్యాను.దృశ్యం-2 ఓ సాయంకాలంగోదారి ఇసుకతెన్నెలపైఆమెను కలిసానుపరిచయాలు స్నేహం ఇష్టం ప్రేమగా మారాయిసంవత్సరాల తర్వాతఅదే గోదారి అదే ఇసుక నడుస్తూ గడిచిపోయిన గతంలోఆమె నదిగా మారిపోయిందినేనేచెలమగా చూస్తుండిపోయా!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment