కలలు + కల్పనలు = నా కవితలు

ఆమెను చూసింది మొదలు ఎడారి పాట నా చెవి లో సోకినా ఈ క్షణం వరకు నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో పదిలపరిచాను . నా సత్య స్వరుపమా ! బొమ్మలు వేయడం నా చేత కాదు . చేతనైతే నా కలలను నా మనోభావాలను రంగుల చిత్రాల తో ప్రదిర్శించే వాడిని ఏ చిత్రకారున్ని నేనశ్రాయుంచాను, అందుకు నా మనస్సు సమ్మతించదు. నా అంతరాత్మా ! ఇవిగో నా శబ్ద చిత్రాలు నా మనస్సంగం లో జనించిన ప్రాణ చిత్రలయున ఏ "కలలు + కల్పనలు = నా కవితలు " నీ పదాల చెంత ఉంచుతున్నాను . -ముజీఫ్

Saturday, February 24, 2018

నేనంటే ఎందుకింత "అ"ఇష్టం

నేనంటే "అ"ఇష్టం

ఏ విషయంలో "అ"ఇష్టం

చెప్పవా...! మనసులోని మాటను

ఆడుకోవద్దు నా జీవితంతో

ఈ "చకోరపక్షి"పై ఎందుకింత అలక...నా వెన్నెలా

ఏమైందో ఏమోగాని...నా మీద అలక ఏలనో...నా వెన్నెలా

చాలాదూరంలోనే వున్నా...మనసు మాత్రం నీ వద్దే...నా వెన్నెలా

ఎటు చూసినా నీ ఆలోచనలే, నీ ఊసులే...నా వెన్నెలా

అమావాస్య నిశి రాతిరిలో ఉన్న నాకు నీ నిండు పున్నమి కావాలి...నా వెన్నెలా

మన్నించి, కరుణించి, దయ చూపవా...నా వెన్నెలా

అలక మాని కిలకిలా నవ్వవే...నా వెన్నెలా

Monday, June 20, 2011

ప్రపంచం గెలిచినవాడైనా,నీ ముందు ఓడిపోవల్సిందేనా, ఎంతటి మహానుభావుడైనా నీ ఎదుట మొకరిల్లాన్సిందేనా!
ఓహ్..........
చందమామ కధలో మాంత్రికుడి ప్రాణం ఏడు సముద్రాలకావల చెట్టు తొర్రలో ఉందని తెలుసు. అమావాస్య నాడు అంతటి ఆకాశం అణువంత వెన్నెల పన్చలెధన్నీతెలుసు. కానీ నా ప్రేమ కు ప్రాణం ఉందో లేకుంటే కనిఇసం నా ఉహకైన రూపం ఉందో,ఉంటె ఒక్క క్షణమైనా మెరుపులా మెరిసి నా జిఇవితానికి సరిపడావేలుగునిస్తుందో లేదో తెలియదు.
ఎంత వెదికాను నా తలలూకి వెళ్ళు జొనిపి నన్ను ఆప్యాయంగా నిమిరే ఒక స్పర్స కోసం,తల పెట్టుకొని పొరలి పొరలి ఏడ్చి సేదతీరే ఒకంక వేచనిఓడికోసం.....
అన్వేషణలో అలసిపోయాను.
సీతాకోకచిలుక రెక్కల్లోంచో సముద్రపు అలల పక్కలోంచో,ఎర్రని రోజా పూవు లాంటి తోలిపోద్దులోంచో,మబ్బు రాల్చే మొదటి చినుకులోంచో,మనసు కొమ్మన వాలేకలలోంచో నువ్వోస్తవాని,నన్ను ప్రేమగా లాలిస్తావని ఎంతగా ఎదురుచుసాను.
గాయం గానో ,జ్ఞాపకంగానో, ఆశ గానో, స్వసగానో,కలగానో,కన్నిటిదారగానో,దురంగానో,దగ్గరగానో,లోపలో,వేలుపాలో,ఏదో ఒకలా,ఎలాగోలా నీ రుపుకోసం ,నీ రాకకోసం................................
కన్నీళ్ళతో కంటి పొరలు కమ్మినపుడో,బాధలో గుండె తీగలు పుట్టుక్కున తెగినప్పుడో,ఒంటరితనంలో దిగులు తెరలు ఆవరించినపుడో...అప్పుడో,ఇప్పుడో,ఎప్పుడోమొతానికి నువ్వుతే బాగున్దేద్హనిపిస్తుంది.నీ సమక్షం లో సంతోషాన్ని పొంగిగిన్చాలనుకున్నాను.
నీకోసం కనిపించిన ప్రతి కంటి కితికిని తట్టాను.వినిపించిన ప్రతి గుండె స్వసనూ విన్నాను, ఒక్క చూపులో నమ్మకం లేదు, ఒక్క స్పర్శలో ప్రేమ లేదు.
నేను ద్వీపం,నువ్వు సముద్రం నేను దేహం,నువ్వు ఉపిరి.
నువ్వు లేని యవ్వనం శిశిరం,నువ్వు కన్బదాత కాలం అమావాస్య.
పూల పుప్పోడితోనోతేనె చుక్కలతోనో ,రేడియం మెరుపుతోనో,ప్లాటినం లేయరతోనో.... ప్రపంచంలో ఉనికి లో ఉన్న అన్నిటి కన్నా భిన్నంగా, మరింత సర్దాగా,అందంగా , ఉన్నతం గా క్రియేటర్ నిన్ను ప్రోగ్రాం చేసి ఉంటాడని తలచాను.సరాసరి స్వర్గం నుంచి నిన్ను నా లైఫ్ లోకి దౌన్ లోడ్ చేస్తఃదని కలలో తెలిపోయాను.
నా ఆలోచనలతోనో,అక్షరాలతోనో,కలలతోనో,కవిత్వంతోను ,నిన్ను వలవేసి పట్టుకోవాలని చూసాను,నా గుందేలోను గూగుల్ లోను ,అన్ని ములలోను నీ కోసంవెదికాను.
నడుస్తూ,నడుతూ అకస్మాతుగా నెల వంకో ఆకాశం వంకో చూస్తుంటాను,మొలకలోను,మెరుపులోనో పోడుచుకోస్తావని.
నీకై నేరిక్షణ లో ఎన్ని రుతువులు,ఎన్ని రంగులు,ఎన్ని కాలాలు,ఎన్నెన్ని క్షణాలు,నీకై అన్వేహణలో ఎన్ని జీవితాలు,ఎన్ని జ్ఞాపకాలు,ఎన్ని రాగాలు,ఎన్నిరూపాలు...........
కనిఇసం కల తెగినప్పుడో,కలత నిద్ర చేదినపుడో,మెలుకువ పూరి విప్పినపుడో నువ్వోస్తవకున్నాను..........
గ్రీస్మలు కాలిపోతున్నాయు గుందేలుకలిపోతునాయు!కలలు కరిగిపోతునాయు కన్నిలు మండిపోతునాయు అయునా నీ జాడ కనబడదేం దేశాలు తిరిగాను,కండాలుకలిపాను రాత్రి పగలని ఏకం చేశాను,అయునా నీ నీడ నన్ను కలవదెం?
నీ పెదాలపై చిరునవ్వులా,నీ నుదుటి పై చేమతలా,చెక్కిలి పై చినుకులా నిలవాలని ఎంతగా ఆశపడ్డాను,కాని నీ కలవరింతలో నన్నొక కన్నీటి భిందువుగామార్చేసావు.నాలో కొత్త సముద్రాన్ని నింపే కన్నీళ్లను వెలికితిసావు.
నీ జాడలేని ప్రపంచం ,నీ నీడ లేని తాకని ప్రపంచం ఉంటేనేం,పోతేనేం ...నీ ఉహే రానపుడు నీ ఉస్ లేనపుడు అది స్వర్గామైతేనేం,నరకమైతేనేం.........
ప్రపంచం నుంచి చాల మంది చాల చూడకుండా,బోలేదన్న్ని అనుభవించకుండా అర్ధంతరంగా నిస్క్రమిన్స్తునారు...
నేను అంతేనా....................
నిన్ను చూడకుండా,నీ స్పర్శను అనుభవించకుండా,ఒక్క క్షణకాలమైన నీ నవ్వుల నదిలో తడవకుండా అంతకాల ప్రవాహం నేనిలాగే కలిసిపోతనా
చివరకి నీ ప్రేమ పొందకుండా లోకం వదులుతాను ..........................?

Wednesday, March 2, 2011

ప్రేమ

మనం............
నిరాశా నిస్పృహల వేడి నిట్టూర్పుల మధ్య ఒరిగిపోయునపుడు
మనల్ని ఓదార్చేది....ప్రేమ!
ఉర్ద్వ బాధల ఉబిలో కూరుకుపొయున్న్న మన బ్రతుకులను
చేయందించి పైకి లాగేది....ప్రేమ!
మనోనిబ్బరాన్ని అధిగమించి కన్నిటికుండ బద్దలయునప్పుడు
మనల్ని లాలించేది ....ప్రేమ!
మనలో ఓడిగిపోయు,మనల్ని జీవితం ఇచ్చేది . ...ప్రేమ!
మనల్ని విరహం లో ముంచేది ....ప్రేమ!
ద్హుకంలోకి దిగజార్చేది ....ప్రేమ!
అందపు అంచుల్ని తాకించేది ....ప్రేమ!
మనల్ని కడదాకా నడిపించే కెలరీ ప్రేమ!
ప్రేమ బాధపడ్తుంది....భాధిస్తుంది-
అయునా...మనకు ప్రేమే ఉపిరి!!!


ఈ ప్రేమ ఒకరికి ఒకరికి మధ్య
ఎన్నో విధాలుగా ఉద్భవిస్తుంది.
ప్రియుడి,ప్రియురాలి మధ్య ప్రేమ-
అన్నాచెల్లెళ్ళ మధ్య ప్రేమ-
భార్యాభర్తల మధ్య ప్రేమ--
మంచి స్నేహితుల మధ్య ప్రేమ
(ఈ ప్రేమ నా చేత ఈ కళలు+కల్పనలు=నా కవితలు(naakalpanalu.blogspot.com పుస్తకం వ్రాయుంచింది )

Friday, October 8, 2010

ఆమెతోనె నా ఏడు అడుగులు



ఆమెను చూస్తే కంటికి వెలుగు రావాలి,ఊహలకు ఊపిరి కలగాలి,ఊపిరికి వేగం పెరగాలి,

ఆశల రెక్కలు విచ్చుకోవాలి,కలలకు ఆకారాం రావలి,ఆ నిముషం స్వర్గం అవ్వాలి,


తన వెన్నెల చూపుల వెలుగులకు యదలో అలికిడి కలగాలి,


తను నడిచొస్తుంటే హ్రుదయ తలుపుల్లో అలజడి రేగాలి,

తన కాలి అందెల సవ్వడికి ప్రక్రుతి పరవసించాలి,

తన మేని పరిమలాలు అత్తరులై ఆకాశాన్ని అంటాలి,

ఆమె స్పర్శతో గుండె లోతుల్లో పవనాలు వీచాలి,

తన కౌగిలితో కంటినీరు ఉప్పెనై ఉబకాలి,

గుండె గుడిలో తన రూపం శాశ్వితంగ నిలిచిపోవాలి,

తననవ్వులు జన్మ జన్మలకు పువ్వులై వర్షించాలి,

పెదవి అంచుల్లొ ప్రతిక్షణం పరితపించె నా పేరె వినపడాలి,

ఆమెతో వేసె 7 అడుగులు 7 జన్మలు గుర్తుకు రావాలి,

తన మాటల గలగల లతో నన్ను నేను మైమరచిపోవాలి,

మెల్లగ ఆమె అడుగుల్లొ అడుగు వెస్తు ప్రపంచాన్ని మరవాలి,

చిగురించె నా చిరు చిరు ఆశలు తన హ్రుదయంతో చిలకాలి,

నా చిటికెన వేలు పట్టుకోని పెళ్ళిబందానికి ప్రాణం పొయాలి,

ఆనందపు అందాలు,అల్లర్లు తన సౌందర్యమైన మోములో కనపడాలి,

విరహయాతనతో నోట మాట రాకుంటే కంటి బాషతో మనసు వెదనంతా తెలుసుకోవాలి,

ప్రతిరోజు ఓ ప్రెమికుల రోజు అయ్ ఇరువురి ఊపిరి గాలిలో ఏకమైపోవాలి..

Tuesday, September 21, 2010

నా చూపు వైశాల్యాన్ని కుదిన్చేస్తావు..

ఏ నక్షత్రాలు మనసుపడి ఇచ్చాయి ఆ నవ్వుని నీకు…

మెరిసే సొగసైన పంటి వరుసతో..

నా ప్రాణాల్ని హాయిగా చెదరగొట్టే మాయతో..

వయసు బరువునంతా మోసే మెత్తటి పెదవులతో.. నవ్వు… నీ నవ్వు.. !


అసలు నీ నవ్వు ఒక్క అధరాల సొంతమా..?

అంత అందమూ వాటిదేనా..? కాదంటే కాదు.!

చూపే పెదవులే అంత అందం తో తరిస్తుంటే..

సృష్టించే హృదయం ఇంకా ఎంత అద్బుతమై ఉంటుంది..!

దాన్ని మోసుకొచ్చే ఆలోచన, తన అదృష్టమనుకుంటుంది..!

నువ్వు నవ్వినప్పుడు..

ఏదో ఈ లోకానికి తెలియని.. నేను ఓపలేని.. అనుభూతిని కళ్ళతో నా మనసులోకి అదుముతావు..

నీ పెదవులే ప్రపంచామనుకునేల నా చూపు వైశాల్యాన్ని కుదిన్చేస్తావు..

రక్తాన్ని ఆపి, శ్వాసని నీ ఆధీనం లోకి లోబరుచుకుంటావు..

ఇన్నీ అంత దూరం నుండే ఎలా చేస్తావు ..???

ముడుచుకుపోయినా ముద్దుగా ఉండే నీ చిన్ని గడ్డం.

ఎర్రని మెరుపులతో వెలిగే తీరిన బుగ్గలు.

ప్రాపంచిక అందాలన్నీ పూర్తయ్యేది నీ నవ్వుతో కలిపి చూస్తేనే కదా.. !

అన్ని దిక్కుల్లోను ఉదయిన్చగలిగే అద్బుతం నీ చిరునవ్వే కదా..!


అయనా..


నీ పెదవోంపు నా హృదయం లోకి ఓంపిన అనిర్జీవమైన సాగరంతో..

ఈ అక్షరాలని తడిపేదెంత..? ఓ చినుకంత..!!!!