కలలు + కల్పనలు = నా కవితలు

ఆమెను చూసింది మొదలు ఎడారి పాట నా చెవి లో సోకినా ఈ క్షణం వరకు నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో పదిలపరిచాను . నా సత్య స్వరుపమా ! బొమ్మలు వేయడం నా చేత కాదు . చేతనైతే నా కలలను నా మనోభావాలను రంగుల చిత్రాల తో ప్రదిర్శించే వాడిని ఏ చిత్రకారున్ని నేనశ్రాయుంచాను, అందుకు నా మనస్సు సమ్మతించదు. నా అంతరాత్మా ! ఇవిగో నా శబ్ద చిత్రాలు నా మనస్సంగం లో జనించిన ప్రాణ చిత్రలయున ఏ "కలలు + కల్పనలు = నా కవితలు " నీ పదాల చెంత ఉంచుతున్నాను . -ముజీఫ్

Monday, June 20, 2011

ప్రపంచం గెలిచినవాడైనా,నీ ముందు ఓడిపోవల్సిందేనా, ఎంతటి మహానుభావుడైనా నీ ఎదుట మొకరిల్లాన్సిందేనా!
ఓహ్..........
చందమామ కధలో మాంత్రికుడి ప్రాణం ఏడు సముద్రాలకావల చెట్టు తొర్రలో ఉందని తెలుసు. అమావాస్య నాడు అంతటి ఆకాశం అణువంత వెన్నెల పన్చలెధన్నీతెలుసు. కానీ నా ప్రేమ కు ప్రాణం ఉందో లేకుంటే కనిఇసం నా ఉహకైన రూపం ఉందో,ఉంటె ఒక్క క్షణమైనా మెరుపులా మెరిసి నా జిఇవితానికి సరిపడావేలుగునిస్తుందో లేదో తెలియదు.
ఎంత వెదికాను నా తలలూకి వెళ్ళు జొనిపి నన్ను ఆప్యాయంగా నిమిరే ఒక స్పర్స కోసం,తల పెట్టుకొని పొరలి పొరలి ఏడ్చి సేదతీరే ఒకంక వేచనిఓడికోసం.....
అన్వేషణలో అలసిపోయాను.
సీతాకోకచిలుక రెక్కల్లోంచో సముద్రపు అలల పక్కలోంచో,ఎర్రని రోజా పూవు లాంటి తోలిపోద్దులోంచో,మబ్బు రాల్చే మొదటి చినుకులోంచో,మనసు కొమ్మన వాలేకలలోంచో నువ్వోస్తవాని,నన్ను ప్రేమగా లాలిస్తావని ఎంతగా ఎదురుచుసాను.
గాయం గానో ,జ్ఞాపకంగానో, ఆశ గానో, స్వసగానో,కలగానో,కన్నిటిదారగానో,దురంగానో,దగ్గరగానో,లోపలో,వేలుపాలో,ఏదో ఒకలా,ఎలాగోలా నీ రుపుకోసం ,నీ రాకకోసం................................
కన్నీళ్ళతో కంటి పొరలు కమ్మినపుడో,బాధలో గుండె తీగలు పుట్టుక్కున తెగినప్పుడో,ఒంటరితనంలో దిగులు తెరలు ఆవరించినపుడో...అప్పుడో,ఇప్పుడో,ఎప్పుడోమొతానికి నువ్వుతే బాగున్దేద్హనిపిస్తుంది.నీ సమక్షం లో సంతోషాన్ని పొంగిగిన్చాలనుకున్నాను.
నీకోసం కనిపించిన ప్రతి కంటి కితికిని తట్టాను.వినిపించిన ప్రతి గుండె స్వసనూ విన్నాను, ఒక్క చూపులో నమ్మకం లేదు, ఒక్క స్పర్శలో ప్రేమ లేదు.
నేను ద్వీపం,నువ్వు సముద్రం నేను దేహం,నువ్వు ఉపిరి.
నువ్వు లేని యవ్వనం శిశిరం,నువ్వు కన్బదాత కాలం అమావాస్య.
పూల పుప్పోడితోనోతేనె చుక్కలతోనో ,రేడియం మెరుపుతోనో,ప్లాటినం లేయరతోనో.... ప్రపంచంలో ఉనికి లో ఉన్న అన్నిటి కన్నా భిన్నంగా, మరింత సర్దాగా,అందంగా , ఉన్నతం గా క్రియేటర్ నిన్ను ప్రోగ్రాం చేసి ఉంటాడని తలచాను.సరాసరి స్వర్గం నుంచి నిన్ను నా లైఫ్ లోకి దౌన్ లోడ్ చేస్తఃదని కలలో తెలిపోయాను.
నా ఆలోచనలతోనో,అక్షరాలతోనో,కలలతోనో,కవిత్వంతోను ,నిన్ను వలవేసి పట్టుకోవాలని చూసాను,నా గుందేలోను గూగుల్ లోను ,అన్ని ములలోను నీ కోసంవెదికాను.
నడుస్తూ,నడుతూ అకస్మాతుగా నెల వంకో ఆకాశం వంకో చూస్తుంటాను,మొలకలోను,మెరుపులోనో పోడుచుకోస్తావని.
నీకై నేరిక్షణ లో ఎన్ని రుతువులు,ఎన్ని రంగులు,ఎన్ని కాలాలు,ఎన్నెన్ని క్షణాలు,నీకై అన్వేహణలో ఎన్ని జీవితాలు,ఎన్ని జ్ఞాపకాలు,ఎన్ని రాగాలు,ఎన్నిరూపాలు...........
కనిఇసం కల తెగినప్పుడో,కలత నిద్ర చేదినపుడో,మెలుకువ పూరి విప్పినపుడో నువ్వోస్తవకున్నాను..........
గ్రీస్మలు కాలిపోతున్నాయు గుందేలుకలిపోతునాయు!కలలు కరిగిపోతునాయు కన్నిలు మండిపోతునాయు అయునా నీ జాడ కనబడదేం దేశాలు తిరిగాను,కండాలుకలిపాను రాత్రి పగలని ఏకం చేశాను,అయునా నీ నీడ నన్ను కలవదెం?
నీ పెదాలపై చిరునవ్వులా,నీ నుదుటి పై చేమతలా,చెక్కిలి పై చినుకులా నిలవాలని ఎంతగా ఆశపడ్డాను,కాని నీ కలవరింతలో నన్నొక కన్నీటి భిందువుగామార్చేసావు.నాలో కొత్త సముద్రాన్ని నింపే కన్నీళ్లను వెలికితిసావు.
నీ జాడలేని ప్రపంచం ,నీ నీడ లేని తాకని ప్రపంచం ఉంటేనేం,పోతేనేం ...నీ ఉహే రానపుడు నీ ఉస్ లేనపుడు అది స్వర్గామైతేనేం,నరకమైతేనేం.........
ప్రపంచం నుంచి చాల మంది చాల చూడకుండా,బోలేదన్న్ని అనుభవించకుండా అర్ధంతరంగా నిస్క్రమిన్స్తునారు...
నేను అంతేనా....................
నిన్ను చూడకుండా,నీ స్పర్శను అనుభవించకుండా,ఒక్క క్షణకాలమైన నీ నవ్వుల నదిలో తడవకుండా అంతకాల ప్రవాహం నేనిలాగే కలిసిపోతనా
చివరకి నీ ప్రేమ పొందకుండా లోకం వదులుతాను ..........................?

1 comment: