కలలు + కల్పనలు = నా కవితలు

ఆమెను చూసింది మొదలు ఎడారి పాట నా చెవి లో సోకినా ఈ క్షణం వరకు నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో పదిలపరిచాను . నా సత్య స్వరుపమా ! బొమ్మలు వేయడం నా చేత కాదు . చేతనైతే నా కలలను నా మనోభావాలను రంగుల చిత్రాల తో ప్రదిర్శించే వాడిని ఏ చిత్రకారున్ని నేనశ్రాయుంచాను, అందుకు నా మనస్సు సమ్మతించదు. నా అంతరాత్మా ! ఇవిగో నా శబ్ద చిత్రాలు నా మనస్సంగం లో జనించిన ప్రాణ చిత్రలయున ఏ "కలలు + కల్పనలు = నా కవితలు " నీ పదాల చెంత ఉంచుతున్నాను . -ముజీఫ్

Friday, October 8, 2010

ఆమెతోనె నా ఏడు అడుగులు



ఆమెను చూస్తే కంటికి వెలుగు రావాలి,ఊహలకు ఊపిరి కలగాలి,ఊపిరికి వేగం పెరగాలి,

ఆశల రెక్కలు విచ్చుకోవాలి,కలలకు ఆకారాం రావలి,ఆ నిముషం స్వర్గం అవ్వాలి,


తన వెన్నెల చూపుల వెలుగులకు యదలో అలికిడి కలగాలి,


తను నడిచొస్తుంటే హ్రుదయ తలుపుల్లో అలజడి రేగాలి,

తన కాలి అందెల సవ్వడికి ప్రక్రుతి పరవసించాలి,

తన మేని పరిమలాలు అత్తరులై ఆకాశాన్ని అంటాలి,

ఆమె స్పర్శతో గుండె లోతుల్లో పవనాలు వీచాలి,

తన కౌగిలితో కంటినీరు ఉప్పెనై ఉబకాలి,

గుండె గుడిలో తన రూపం శాశ్వితంగ నిలిచిపోవాలి,

తననవ్వులు జన్మ జన్మలకు పువ్వులై వర్షించాలి,

పెదవి అంచుల్లొ ప్రతిక్షణం పరితపించె నా పేరె వినపడాలి,

ఆమెతో వేసె 7 అడుగులు 7 జన్మలు గుర్తుకు రావాలి,

తన మాటల గలగల లతో నన్ను నేను మైమరచిపోవాలి,

మెల్లగ ఆమె అడుగుల్లొ అడుగు వెస్తు ప్రపంచాన్ని మరవాలి,

చిగురించె నా చిరు చిరు ఆశలు తన హ్రుదయంతో చిలకాలి,

నా చిటికెన వేలు పట్టుకోని పెళ్ళిబందానికి ప్రాణం పొయాలి,

ఆనందపు అందాలు,అల్లర్లు తన సౌందర్యమైన మోములో కనపడాలి,

విరహయాతనతో నోట మాట రాకుంటే కంటి బాషతో మనసు వెదనంతా తెలుసుకోవాలి,

ప్రతిరోజు ఓ ప్రెమికుల రోజు అయ్ ఇరువురి ఊపిరి గాలిలో ఏకమైపోవాలి..

2 comments:

  1. అన్ని కవితలు అద్దిరిపోయాయి గురూ...!!
    సూపర్.
    http://bukke.blogspot.com/

    నా కవితలు చూడండి.
    మీకు పూర్తి భిన్నం.

    ReplyDelete
  2. ముజీఫ్ గారూ ! ''ఆమెతోనే నా ఏడు అడుగులు'' కవిత చాలా చాలా బావుంది.
    హృదయానికి హత్తుకునేంత హృదయం గా ఉంది..
    రస హృదయులను ఆకర్షించేంత రమ్యం గా ఉంది.
    మీ వంటి కవితా పిపాసిని కలిసినందుకు చాలా ఆనందం గా ఉంది.
    మీ ఫ్లో లో మంచి ఫీల్ ఉంది. కీప్ ఇట్ అప్.
    నమస్తే.
    శ్రీజ సాదినేని.

    ReplyDelete