స్నేహమంటే ఇష్టాలని పంచుకోవటం అనుకున్నాను ,
కష్టాలని పంచుకోవట్టమని నేర్పావు .
ప్రేమంటే మనసు పడే ఆరాటం అనుకున్నాను ,
స్వార్ధం ఎరుగని బందమని నేర్పావు .
చిరునవ్వులు మన సంతోషానికీ అనుకున్నాను ,
బాధల్లో ఉన్నవారితో పంచువటానికి దేవుడిచ్చిన వరమని నేర్పావు .
కన్నీరు మనలోని బలహీనతకు నిదర్శనం అనుకున్నాను ,
మండే గుండెల్ని చల్లార్చే సాదానమని నేర్పావు .
జీవితమంటే అలుపెరగని ప్రయానమనుకున్నాను ,
మంచిని పంచె మార్గమని నేర్పావు .
చావంటే ముగింపు అనుకున్నాను ,
మరో చరిత్రకి ఆరంభం అని నేర్పావు .
ఇన్ని నేర్పిన నీవు , నీ వేపే పరుగులు తీస్తున్నా ,
నా మనసుని అదుపు చేయటం నేర్పావా నేస్తమా...!!!
కలలు + కల్పనలు = నా కవితలు
ఆమెను చూసింది మొదలు
ఎడారి పాట నా చెవి లో సోకినా
ఈ క్షణం వరకు
నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక
పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో
పదిలపరిచాను .
నా సత్య స్వరుపమా !
బొమ్మలు వేయడం నా చేత కాదు .
చేతనైతే నా కలలను
నా మనోభావాలను
రంగుల చిత్రాల తో
ప్రదిర్శించే వాడిని
ఏ చిత్రకారున్ని
నేనశ్రాయుంచాను,
అందుకు నా మనస్సు సమ్మతించదు.
నా అంతరాత్మా !
ఇవిగో నా శబ్ద చిత్రాలు
నా మనస్సంగం లో
జనించిన ప్రాణ చిత్రలయున
ఏ "కలలు + కల్పనలు = నా కవితలు "
నీ పదాల చెంత ఉంచుతున్నాను .
-ముజీఫ్
No comments:
Post a Comment