
నీ తలపులు తన కోసమే అని తెలుసు,
నీ గుండెలో నిండినది తన ప్రేమేనని తెలుసు,
కాని మనసు మాట విడటం లేదు,
నిన్ను అది మరవటం లేదు,
నీ మనసుని తనకు పంచి తన ప్రేమను స్వీకరించావని తెలిసి కూడ,
నీ మనసు నీ దగ్గర లేదని తెలిసి కూడ ఏదొ గెలవాలని ఆరాటపడుతుంది,
నీ మనసు ఎడారిలో ప్రేమ దాహం తీర్చుకోవాలనుకుంటుంది,
వినవా మనసా తానిక మనకు దక్కదని అంటే,
కనీసం తన ఆనందంలో నన్నా నా ప్రేమను చూసుకుంటానూని అంటుంది,
ప్రేమ దొరకకపొయినా ప్రేయసిని చూస్తూ గడిపేస్తానంటుంది,
కన్నీటి జ్వాలలు మనసుని కాల్చేస్తున్నా ఆనందంగా చిరునవ్వులు చిందిస్తుంది
No comments:
Post a Comment