నింగికేదో వేదన అనుకుంటా ..
ఉదయం నుంచి అశ్రుధారలు కురుస్తూనే ఉన్నాయి.
రొమ్ము కొట్టుకుని ఏడుస్తున్నట్టు మధ్య మధ్యలో ఉరుముల చప్పుడు..
పైకి చెప్పలేని బాధ ఏదో తన గుండె చీల్చుతున్నట్టు ,
తనలో తాను కుమిలిపోతున్నట్టు ,అశ్రుధారలు కురుస్తూనే ఉన్నాయి .
నీవు దూరమైన నాడు నా గుండె పగిలినప్పుడు అదే చప్పుడు,
రొమ్ము కొట్టుకున్నట్టు ...
నాటి నుడీ నా కళ్లు వర్షిస్తూనే ఉన్నాయి ..
వీవు ఒంటరివి కాదు నేస్తం అని నేను నింగి వైపు చేతులు చాచి ..
స్నేహ హస్తం అందిస్తున్నాను...
అయినా ,అశ్రుధారలు కురుస్తూనే ఉన్నాయి.
No comments:
Post a Comment