కలలు + కల్పనలు = నా కవితలు

ఆమెను చూసింది మొదలు ఎడారి పాట నా చెవి లో సోకినా ఈ క్షణం వరకు నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో పదిలపరిచాను . నా సత్య స్వరుపమా ! బొమ్మలు వేయడం నా చేత కాదు . చేతనైతే నా కలలను నా మనోభావాలను రంగుల చిత్రాల తో ప్రదిర్శించే వాడిని ఏ చిత్రకారున్ని నేనశ్రాయుంచాను, అందుకు నా మనస్సు సమ్మతించదు. నా అంతరాత్మా ! ఇవిగో నా శబ్ద చిత్రాలు నా మనస్సంగం లో జనించిన ప్రాణ చిత్రలయున ఏ "కలలు + కల్పనలు = నా కవితలు " నీ పదాల చెంత ఉంచుతున్నాను . -ముజీఫ్

Sunday, December 6, 2009

నా చెలి పుట్టిన రోజు ...

ఆ నది నిశీధిలో కడలి ఒడిని తాకుతూ వచ్చిన గాలులు నాకు గుర్తు చేసాయి ఈ రోజే ని పుట్టిన రోజని...
అంబరాన్ని దాటుకుంటూ వచ్చిన లేభానుని కిరణాలు నాకు గుర్తు చేసాయి ఈ రోజే నీ పుట్టినరోజని..
చెలీ...ఆకాశంలో తారలన్నింటిని మాలగా అల్లి నికిద్దామనుకున్నా..కాని నువ్వే ఒక తారవని ఊరుకున్నా..
రంగు రంగుల సీతాకోక చిలకల్ని దోసిట పట్టి నికిద్దమనుకున్నా..కాని ఇంద్రధనస్సు లాంటి నీ ముందు అవి వెల వెల బోతాయని వదిలేశా...
పోనీ ఓ గుప్పెడు గులాబిలయినా నికిద్దామనుకుంటే..నీ ఆధారాల ముందు వాటి గులాబిధానం ఎపాటిదని మానుకున్న..
సరే..ఒక రోజా అయినా నికిచ్చి.. నీ మీద నాకున్న అభిమానం తెలియచేద్దాం అనుకున్నా., నీ చెక్కిళ్ళ ఎర్రదనానికి అది సాటి రాదని వదిలేశా..
తుమ్మెదలతో పోటి పడి మకరందం సంపాదించా..నికిద్దామని..కానీ నువ్వు చూపించే ప్రేమ ముందు దాని తియ్యదనం ఎపాటిదని దాన్ని కూడా వదిలేశా...
అప్పుడనిపిచింది..అనుక్షణం నిన్ను ఆరాధించే, నీకై పరితపించే, నా నిండు మనసుతో చెప్పే శుభాకాంక్షలే..నీకు నేనిచే అతి విలువైన బహుమతి అనీ..ఆ క్షణంలో నీ కళ్ళల్లో కనిపించే ఆనందమే అందుకు సాక్షి అనీ....

No comments:

Post a Comment