కలలు + కల్పనలు = నా కవితలు

ఆమెను చూసింది మొదలు ఎడారి పాట నా చెవి లో సోకినా ఈ క్షణం వరకు నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో పదిలపరిచాను . నా సత్య స్వరుపమా ! బొమ్మలు వేయడం నా చేత కాదు . చేతనైతే నా కలలను నా మనోభావాలను రంగుల చిత్రాల తో ప్రదిర్శించే వాడిని ఏ చిత్రకారున్ని నేనశ్రాయుంచాను, అందుకు నా మనస్సు సమ్మతించదు. నా అంతరాత్మా ! ఇవిగో నా శబ్ద చిత్రాలు నా మనస్సంగం లో జనించిన ప్రాణ చిత్రలయున ఏ "కలలు + కల్పనలు = నా కవితలు " నీ పదాల చెంత ఉంచుతున్నాను . -ముజీఫ్

Sunday, December 6, 2009

అమృతం

చిగురు తొడిగిన కొమ్మపై చినుకు చేసే అందాలు,

చినుకు తాకిన పుడమిపై మట్టి పంచే పరిమళాలు,

పుడమి పంచిన ప్రేమతో ప్రకృతి చూపే సోయగాలు,

ప్రకృతి సోయగాలతో పరవశించి కోయిల పాడే స్వరాలు,

కోయిల స్వరాల మాధుర్యంతో మది రాసిన కావ్యాలు,

మది రాసిన కావ్యాలతో చెలి చెక్కిళ్ళపై చిరునవ్వులు,

ప్రతి అందం అద్బుతం, ప్రతి అంశం అమృతం

No comments:

Post a Comment