కలలు + కల్పనలు = నా కవితలు
ఆమెను చూసింది మొదలు
ఎడారి పాట నా చెవి లో సోకినా
ఈ క్షణం వరకు
నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక
పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో
పదిలపరిచాను .
నా సత్య స్వరుపమా !
బొమ్మలు వేయడం నా చేత కాదు .
చేతనైతే నా కలలను
నా మనోభావాలను
రంగుల చిత్రాల తో
ప్రదిర్శించే వాడిని
ఏ చిత్రకారున్ని
నేనశ్రాయుంచాను,
అందుకు నా మనస్సు సమ్మతించదు.
నా అంతరాత్మా !
ఇవిగో నా శబ్ద చిత్రాలు
నా మనస్సంగం లో
జనించిన ప్రాణ చిత్రలయున
ఏ "కలలు + కల్పనలు = నా కవితలు "
నీ పదాల చెంత ఉంచుతున్నాను .
-ముజీఫ్
Saturday, March 20, 2010
చెలీ... నీ ప్రేమకోసమై
ప్రియా నీ చూపులో ఉన్నది ప్రేమామృతం
నీ నవ్వులో దాగున్నది గానామృతం
నీవు పలికే ప్రతి మాటా నాకు వేదామృతం
నీ నడకలోని ప్రతి అడుగు ఓ నృత్యామృతం
అందుకే చెలీ నా ప్రేమలో ఇంత ఆవేదన
దానిని సాధించేందుకే ప్రతీక్షణం నాలో ఈ తపన
నీవే నా సర్వస్వం అని నీవే నా ప్రాణం అని
నీవే నా లోకం అని అనుక్షణం కలల్లో విహరించా
కానీ నువ్వు నా సొంతం కాగలవా అని నాకు ఎప్పటికీ సందేహమే
నీవే లోకంగా ఎల్లకాలం నిన్ను ప్రేమించాలనివుంది
నీవే నా జీవితానికి గమ్యంగా నిన్ను అభిమానించాలనివుంది
నీవే నా ప్రేయసిగా ఎల్లప్పుడూ ఆరాదించాలనివుంది
కానీ నీకంటూ ఇష్టం లేకుంటే నా ప్రేమను ఎలా చెప్పగలను
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment