అందమైన ఓ చందమామ....
అందకుండా అటు పోతావేం......
నడిచెలుతుంటే నాతో వస్తావ్.....
నిలబడి చూస్తే నవ్వేసెల్తావ్....
చూసేకేమో అందంగుంటావ్....
రారమ్మంటే నే రానంటావ్.......
అమవాస్యేం మీ అమ్మ చుట్టమా.........
అడగంగానే అటు వెల్లొస్తావ్...........
వెల్లే దారిలో కనిపిస్తుంటావ్....
కనిపిస్తూనే కనుమరుగవుతావ్.....
పిలిచి పిలిచి అలిసి పోయినా....
పలకరించవు ప్రార్థించినా......
చిన్నపిల్లల చిలిపి పిలుపులు ....
చేరలేదా నీ చెవి చేరువకు.....
మా సిరులు తూచని చెల్లెలి కోసం...
తరలి వస్తే తొలిగి పోవా.....
నీ మది లోని మచ్చల సైతం..
కలలు + కల్పనలు = నా కవితలు
ఆమెను చూసింది మొదలు
ఎడారి పాట నా చెవి లో సోకినా
ఈ క్షణం వరకు
నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక
పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో
పదిలపరిచాను .
నా సత్య స్వరుపమా !
బొమ్మలు వేయడం నా చేత కాదు .
చేతనైతే నా కలలను
నా మనోభావాలను
రంగుల చిత్రాల తో
ప్రదిర్శించే వాడిని
ఏ చిత్రకారున్ని
నేనశ్రాయుంచాను,
అందుకు నా మనస్సు సమ్మతించదు.
నా అంతరాత్మా !
ఇవిగో నా శబ్ద చిత్రాలు
నా మనస్సంగం లో
జనించిన ప్రాణ చిత్రలయున
ఏ "కలలు + కల్పనలు = నా కవితలు "
నీ పదాల చెంత ఉంచుతున్నాను .
-ముజీఫ్
No comments:
Post a Comment