నీ కన్నులకి ఆ సూర్యుడు కాంతి నిచ్చాడు,
నీ నవ్వులకి ఆ పువ్వులు సొగసు నిచ్చాయీ,
నీ పెదవులకు ఆ గులాబిలు రంగునిచ్చాయీ,
నీ గొంతుకి ఆ కొకిల స్వరాన్నిచ్చింది,
నీ సొగసైన శరీరానికి ఆ దేవుడూ ప్రాణం పోసాదు,
మరి నేనేమి ఇవ్వగలను నీకు,
అందుకే నేను ముక్కుపుడకనై నీ మోముకి అందాన్ని ఇవ్వాలనుకుంటున్నాను.
కలలు + కల్పనలు = నా కవితలు
ఆమెను చూసింది మొదలు
ఎడారి పాట నా చెవి లో సోకినా
ఈ క్షణం వరకు
నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక
పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో
పదిలపరిచాను .
నా సత్య స్వరుపమా !
బొమ్మలు వేయడం నా చేత కాదు .
చేతనైతే నా కలలను
నా మనోభావాలను
రంగుల చిత్రాల తో
ప్రదిర్శించే వాడిని
ఏ చిత్రకారున్ని
నేనశ్రాయుంచాను,
అందుకు నా మనస్సు సమ్మతించదు.
నా అంతరాత్మా !
ఇవిగో నా శబ్ద చిత్రాలు
నా మనస్సంగం లో
జనించిన ప్రాణ చిత్రలయున
ఏ "కలలు + కల్పనలు = నా కవితలు "
నీ పదాల చెంత ఉంచుతున్నాను .
-ముజీఫ్
No comments:
Post a Comment