కడలి నైన,నాదు గుండె
కదలలేను తాను అంది
చెలి జాబిలి చెంత చేర
తపనేదొ దాగి ఉంది
తలుకు లొలుకు తన అందం
నింగి దాక ఎగరమంది
ఎగసి పడ్డ అల నేనై
నింగి దాక చేరలేక
రాళ్ళ పైన రాలుతుంటె
తనను తాను ఆదమరచి
శిలల గుండె పలుకుతుండె....
నీ తపనల జడిలొ
నీ కోసం వేచిఉన్న శిలనంది...
నీ తలపుల ఒడిలొ
నీ పిలుపులు దాచుకున్న కలనంది...
జాబిలమ్మ జాడ మరిచి
ఈ జాన కొలువు చేరమంది...
అందనంది వెన్నల సొగసు
వేచిఉంది శిలల మనసు
కలలు + కల్పనలు = నా కవితలు
ఆమెను చూసింది మొదలు
ఎడారి పాట నా చెవి లో సోకినా
ఈ క్షణం వరకు
నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక
పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో
పదిలపరిచాను .
నా సత్య స్వరుపమా !
బొమ్మలు వేయడం నా చేత కాదు .
చేతనైతే నా కలలను
నా మనోభావాలను
రంగుల చిత్రాల తో
ప్రదిర్శించే వాడిని
ఏ చిత్రకారున్ని
నేనశ్రాయుంచాను,
అందుకు నా మనస్సు సమ్మతించదు.
నా అంతరాత్మా !
ఇవిగో నా శబ్ద చిత్రాలు
నా మనస్సంగం లో
జనించిన ప్రాణ చిత్రలయున
ఏ "కలలు + కల్పనలు = నా కవితలు "
నీ పదాల చెంత ఉంచుతున్నాను .
-ముజీఫ్
No comments:
Post a Comment