కలలు + కల్పనలు = నా కవితలు

ఆమెను చూసింది మొదలు ఎడారి పాట నా చెవి లో సోకినా ఈ క్షణం వరకు నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో పదిలపరిచాను . నా సత్య స్వరుపమా ! బొమ్మలు వేయడం నా చేత కాదు . చేతనైతే నా కలలను నా మనోభావాలను రంగుల చిత్రాల తో ప్రదిర్శించే వాడిని ఏ చిత్రకారున్ని నేనశ్రాయుంచాను, అందుకు నా మనస్సు సమ్మతించదు. నా అంతరాత్మా ! ఇవిగో నా శబ్ద చిత్రాలు నా మనస్సంగం లో జనించిన ప్రాణ చిత్రలయున ఏ "కలలు + కల్పనలు = నా కవితలు " నీ పదాల చెంత ఉంచుతున్నాను . -ముజీఫ్

Monday, December 7, 2009

మనసంతా మధువయ్యి చిలికిందిలే...

మనసంతా మధువయ్యి చిలికిందిలే
వయసంతా వరదయ్యి కురిసిందిలే
తనువులో తపనలే....దోర వయసు దాచినా దాగదు
తెలియనీ మెలికలే..బిగుసుకున్న వేళ నాలో...

(||మనసంతా||)

కొమ్మలో ... మొగ్గకీ ...కోరికేం మెదిలెనో ఏమిటో
గోరు వెచ్చెగా విచ్చెనూ...ఒళ్ళు విరుచుకునీ మెల్లగా మల్లెలై...
పసిడి పొద్దులో వర్ణాలు ఎందుకో
కుర్ర వాగులో ఆ ఉరుకులేమిటో
గున్నమామి కొమ్మ మీద గోరువంక మనసు దోచుకున్న చిలక పలుకులోని భావమేమి చెప్పెనో మరి...

(||మనసంతా||)
చల్లటీ... గాలులే...మోసుకెల్లెనూ నేల రాయబారమే
నింగిలో... రంగులే ...ప్రేమలేఖలై చదివెనూ సందేశమే
ఆమనొచ్చెనూ అందాలు తెచ్చెనూ
మంచు కురిసెనూ...వనాలు మురిసెనూ
నంగనాచి నల్ల మబ్బు నింగి బుగ్గ గిల్లగానే వాన కురిసి మొగ్గ విరిసి నవ్వుకున్న హాయిలో...
(||మనసంతా||)

నడకలో తడబాటులే....తికమక అడుగులై సాగెనూ
తలపుతో తలపడే...అదుపులేని ఆశలే లాగెనూ
యెవ్వనానికి ఎవేలే ఇందనం
ప్రతి జీవితానికి ఇదేలే చందనం
దేవదారు చెట్టునెక్కి పారిజాత పువ్వు తెచ్చి జడను పెట్టు వాడు నా వరుడు కాడా మరి....

(||మనసంతా||)

No comments:

Post a Comment