కలలు + కల్పనలు = నా కవితలు

ఆమెను చూసింది మొదలు ఎడారి పాట నా చెవి లో సోకినా ఈ క్షణం వరకు నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో పదిలపరిచాను . నా సత్య స్వరుపమా ! బొమ్మలు వేయడం నా చేత కాదు . చేతనైతే నా కలలను నా మనోభావాలను రంగుల చిత్రాల తో ప్రదిర్శించే వాడిని ఏ చిత్రకారున్ని నేనశ్రాయుంచాను, అందుకు నా మనస్సు సమ్మతించదు. నా అంతరాత్మా ! ఇవిగో నా శబ్ద చిత్రాలు నా మనస్సంగం లో జనించిన ప్రాణ చిత్రలయున ఏ "కలలు + కల్పనలు = నా కవితలు " నీ పదాల చెంత ఉంచుతున్నాను . -ముజీఫ్

Sunday, December 13, 2009

హృదయం పగిలిపోతోంది

హృదయం పగిలిపోతోంది
ఒకటా రెండా, ఐదు ముక్కలు చెయ్యమని
వినిపిస్తున్న వాదనలకు
వెక్కి వెక్కి ఏడుస్తోంది, వేదిస్తోంది

విడిపడి బాగుపడితే సంతోషమే
అని మూలాన వున్నా
చీలికలతో అవకాశవాద నాయకులకు
సామాన్యుడు మరింత చులకన అవుతాడేమో అనిపిస్తోంది, భయమేస్తోంది

ఇక సద్దుకుంటుందన్న తరుణంలో
ఎగసి మరింత పాకిన మంటలకు
బలవుతున్నది మాత్రం ఎవరు
వెనుకున్న కుట్ర తెలియక చెప్పినదల్లా నమ్మే అమాయకుడు సామాన్యుడు
ఎంతో ఆశించి, వాటి సాధనకు ఎంతకైనా తెగించి సర్వం కోల్పోతున్న విద్యార్ధి
ఎవరికి ఏమొచ్చినా కోపాగ్నికి బూడిదవుతున్న నాలుగు చక్రాల మూగ ప్రాణి

రాష్ట్రమంతా రణరంగంలా కనిపిస్తోంది
స్వప్రయోజనమే ధ్వనిస్తోంది
ప్రజా శ్రేయస్సును తుంగలో తొక్కి
స్వార్ధం నిండిన మొండితనమే రాజ్యమేలుతోంది

అందరి ఆకలి ఒకటే
రాలే కన్నీరూ ఒకటే
కానీ మా బాధే గొప్పది
మాకు జరిగినదే ఉపేక్షము అనుట తగునా
ఇటువంటి పోలికలు విని కన్నీరు కన్నీరు పెడుతోంది
ఆత్మహత్యలు వద్దని మొర పెట్టుకుంటోంది
ఎవ్వరినీ నొప్పించని పరిష్కారమునకు వేడుకుంటోంది, విలపిస్తోంది

జనం మాటల్లోనే స్వచ్ఛత వుంది
వీడిపోవడానికైన, కలిసున్డడానికైనా
వారు ఎన్నుకోవలసోచ్చిన ప్రతినిధుల మాట కాక
ప్రజాభిప్రాయం సేకరించి వారి అభిమతమునకు సమ్మతించరాదా

No comments:

Post a Comment