ఎప్పుడు ఎప్పుడు చుస్తానానని రాత్రంతా తన రాక కోసమే ఎదురు చూపులు
మున్నెప్పుడూ చూడనిది కాదు, ప్రతిరోజూ చూసేదే
ఆయినా రోజూ ఇంకా కొత్తగా అనిపిస్తుంది, అలా చూస్తూనే వుండిపోవాలని అనిపించేంతగా
చీకటిని వదిలిన నీలాకాశం కూడా తన రాక కోసం ఎదురు చూస్తోంది
ఇంతలో దూరంగా కనిపిస్తున కొండల నడుమ స్వర్గ లోకపు ద్వారంలా
అందమయిన వంపేదో కనిపిస్తోంది
కలలను స్వాగతిస్తూ, వాటి సాధనకు మరొకరోజుతో
ఉత్తేజానిస్తూ ఆ భానుడు ఉదయిస్తున్నాడు
కౌగిలించుకోవాలనిపించేల ఉన్నాడు
ప్రియనేస్తంలా ప్రేరణ ఇస్తున్నాడు
సూర్యకిరణాలు దోవలో మొదట తమనే తాకినందుకు ఆ మబ్బులు హొయలు పోతునాయి
కప్పబడిన తెరనేదో తెన్చుకునట్లు ఒక్కసారిగా ఆ గాలి ఆహ్లాదకరంగా మారి సందడి చేస్తోంది
రవ్వంత కూడా ఆశ లేనట్టు కాంతివిహీనమైన సరస్సుకు ఆ వెలుగు ఊపిరినిచ్చింది
నీటిలో ఆ ఎర్రటి కిరణాల ప్రతిబింబం మేలిమి సువర్ణ తేజమై కనువిందు చేస్తోంది
సుప్రభాతం విని మేలుకున్న శ్రీనివాసుడు
రవి సోగాస్సులను చూసి మురిసి వైకుంఠం వదిలాడు
సుదర్శనుడి ఫలములలో పులకిస్తూ
కోయిల పాటయ్యాడు, పువ్వులలో వికసించాడు
అలసి విశ్రమించిన తనువులకు ఈ ఉల్లాసం తాకింది
పరస్పర పలకరింపులతో ఒక కొత్త రోజు మొదలైంది
No comments:
Post a Comment