కలలు + కల్పనలు = నా కవితలు

ఆమెను చూసింది మొదలు ఎడారి పాట నా చెవి లో సోకినా ఈ క్షణం వరకు నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో పదిలపరిచాను . నా సత్య స్వరుపమా ! బొమ్మలు వేయడం నా చేత కాదు . చేతనైతే నా కలలను నా మనోభావాలను రంగుల చిత్రాల తో ప్రదిర్శించే వాడిని ఏ చిత్రకారున్ని నేనశ్రాయుంచాను, అందుకు నా మనస్సు సమ్మతించదు. నా అంతరాత్మా ! ఇవిగో నా శబ్ద చిత్రాలు నా మనస్సంగం లో జనించిన ప్రాణ చిత్రలయున ఏ "కలలు + కల్పనలు = నా కవితలు " నీ పదాల చెంత ఉంచుతున్నాను . -ముజీఫ్

Sunday, December 13, 2009

ఎలా చెప్పను

గుండెలలో కట్టిన నీ గుడి తోటి
కళ్ళల్లో దాగిన కలలను లేపి
నీ దిక్కునే ఎగురుతున్న నా ఊహలకు
సన్నజాజిలా నిన్ను చుట్టుకున్న నా మనసు నుంచి
వెదజల్లి కవితలాగా పూచిన పువ్వును ఇచ్చి
తెలుపనా నా ప్రేమని
నీతో గూడుకట్టుకున్న భావాన్ని!

పరువాన కురుస్తున్న మాయలోపడి
పెదవిపై ఆగిపోతున మాటలను
నీటి పై ఊరకలు వేస్తూ
గాలిలో రాసి పంపుతున్న ప్రేమలేఖని
నువ్వు చూస్తావని! నా ఆశలకు శ్వాస పోస్తావని!

No comments:

Post a Comment