కలలు + కల్పనలు = నా కవితలు

ఆమెను చూసింది మొదలు ఎడారి పాట నా చెవి లో సోకినా ఈ క్షణం వరకు నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో పదిలపరిచాను . నా సత్య స్వరుపమా ! బొమ్మలు వేయడం నా చేత కాదు . చేతనైతే నా కలలను నా మనోభావాలను రంగుల చిత్రాల తో ప్రదిర్శించే వాడిని ఏ చిత్రకారున్ని నేనశ్రాయుంచాను, అందుకు నా మనస్సు సమ్మతించదు. నా అంతరాత్మా ! ఇవిగో నా శబ్ద చిత్రాలు నా మనస్సంగం లో జనించిన ప్రాణ చిత్రలయున ఏ "కలలు + కల్పనలు = నా కవితలు " నీ పదాల చెంత ఉంచుతున్నాను . -ముజీఫ్

Sunday, December 13, 2009

ఉహాసుందరి

మధురమైన బాలు స్వరములో
బిస్మిల్లా షెహనాయి నాదముతో
కీరవాణి రాగంలోన సిరివెన్నల రచనవై
ప్రాణం పోసుకున్న బాపు బొమ్మ
నీకు ఇంక సాటి ఎవరమ్మా!

పలుకులు నేర్చిన కోయల గాత్రం
తన నడకలో దాగిన నెమలి నాట్యం
నల్లని వర్ణమునకు మారి ఆమె కంటి కాటుక అయిన మెరుపుల వైనం
తన వన్నె, గుణములను అందించిన మల్లెపువ్వు తీరు వర్ణనాతీతం

కన్నార్పక నిన్నే చూస్తున్న నయనాలకు మేఘం చిరుజల్లై కురవగా
సన్నగిలిన తుంపరకు ఆకున వున్న నీటిబొట్టు నీ బుగ్గపై దిష్టిచుక్కవగా
చల్లని పవనానికి నీ నుదిటి మీదుగా బుగ్గలును చేరిన ముంగురులును నువ్వు నీ చేతితో తిప్పుతుండగా
ఇంక తనకు మనగుడే లేదని తెలిసి హరివిల్లు మేఘాలను పుష్ఫలుగా చేసుకుని ఏడు రంగుల పూలజడగా మారగ

ఇలా జగుమున అందాలు అన్ని నీలో ఒకటి అవుతూ
అంతటి సుందర దుశ్ర్యములులను వర్ణించుటకు పదములు కరువై
ఇంతటి రమణీయమైన రూపాన్ని స్వప్నంలో సైతం ఊహించలేని విధంగా
నిన్ను సృష్టించిన మహానబావులకు వందనం అభివందనం

No comments:

Post a Comment