కలలు + కల్పనలు = నా కవితలు

ఆమెను చూసింది మొదలు ఎడారి పాట నా చెవి లో సోకినా ఈ క్షణం వరకు నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో పదిలపరిచాను . నా సత్య స్వరుపమా ! బొమ్మలు వేయడం నా చేత కాదు . చేతనైతే నా కలలను నా మనోభావాలను రంగుల చిత్రాల తో ప్రదిర్శించే వాడిని ఏ చిత్రకారున్ని నేనశ్రాయుంచాను, అందుకు నా మనస్సు సమ్మతించదు. నా అంతరాత్మా ! ఇవిగో నా శబ్ద చిత్రాలు నా మనస్సంగం లో జనించిన ప్రాణ చిత్రలయున ఏ "కలలు + కల్పనలు = నా కవితలు " నీ పదాల చెంత ఉంచుతున్నాను . -ముజీఫ్

Sunday, December 13, 2009

నా గుండెల్లో మలచుకుంటాను….!!!!

!!!పోట్లాట కూడా…నీతో అయితేనే హాయి …
కోపం తో కొట్లాడుకున్నా …నీ సమక్షం లో నే సంత్రుప్తి
నీ ఉఛ్వాసనిశ్వాసాలే తెలియని ఓదార్పు…
ప్రతి అడుగులో నీ తోడుంటే చావునైన జయించగలనన్న ధీమా…
నీ చల్లని స్పర్శే నా మానసిక శాంతి …
నీవు నా లో లేని రోజున నేను లేను…..
అందుకే ఆ రోజు నా జీవితం లో రాకుండా… గమనాన్నే మార్చేస్తాను…
నిన్ను ఒక అనుభూతిగానే నా గుండెల్లో మలచుకుంటాను….!!!!

No comments:

Post a Comment