ఎందుకిలా అన్నిచోట్లా నువ్వే కనిపిస్తావ్?ఈ పిల్లకి అసలు కుదురులేదంటారు.
*** *** ***
గడిచిన నిమిషంలోనిన్ను ఒక్కసారే తలుచుకున్నా.ఈ ఒక్కసారికి నన్ను మన్నించవా?
*** *** ***
ఈ ఒక్కరోజు నవ్వకుండా ఉండరాదూ?ఒంటిమీద నగలన్ని వెలవెలబోతున్నాయి.
*** *** ***
దేవుడు నిన్ను ఆడిపోసుకుంటున్నాడుఏ మంత్రం వేసావో ఏ మాయ చేసావో అనినేను గుడికి వెళ్ళి ఏడాది దాటిందిమరి.
*** *** ***
దోసిలిలో చినుకుల్ని దాచుకొచ్చానీ పెదాలనో లేదా పాదాలనో చేరిముత్యాలవుతాయని. ఎందుకిలా అన్నిచోట్లా నువ్వే కనిపిస్తావ్?ఈ పిల్లకి అసలు కుదురులేదంటారు.
*** *** ***
గడిచిన నిమిషంలోనిన్ను ఒక్కసారే తలుచుకున్నా.ఈ ఒక్కసారికి నన్ను మన్నించవా?
*** *** ***
ఈ ఒక్కరోజు నవ్వకుండా ఉండరాదూ?ఒంటిమీద నగలన్ని వెలవెలబోతున్నాయి.
*** *** ***
దేవుడు నిన్ను ఆడిపోసుకుంటున్నాడుఏ మంత్రం వేసావో ఏ మాయ చేసావో అనినేను గుడికి వెళ్ళి ఏడాది దాటిందిమరి.
*** *** ***
దోసిలిలో చినుకుల్ని దాచుకొచ్చానీ పెదాలనో లేదా పాదాలనో చేరిముత్యాలవుతాయని.
కలలు + కల్పనలు = నా కవితలు
ఆమెను చూసింది మొదలు
ఎడారి పాట నా చెవి లో సోకినా
ఈ క్షణం వరకు
నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక
పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో
పదిలపరిచాను .
నా సత్య స్వరుపమా !
బొమ్మలు వేయడం నా చేత కాదు .
చేతనైతే నా కలలను
నా మనోభావాలను
రంగుల చిత్రాల తో
ప్రదిర్శించే వాడిని
ఏ చిత్రకారున్ని
నేనశ్రాయుంచాను,
అందుకు నా మనస్సు సమ్మతించదు.
నా అంతరాత్మా !
ఇవిగో నా శబ్ద చిత్రాలు
నా మనస్సంగం లో
జనించిన ప్రాణ చిత్రలయున
ఏ "కలలు + కల్పనలు = నా కవితలు "
నీ పదాల చెంత ఉంచుతున్నాను .
-ముజీఫ్
No comments:
Post a Comment