కలలు + కల్పనలు = నా కవితలు

ఆమెను చూసింది మొదలు ఎడారి పాట నా చెవి లో సోకినా ఈ క్షణం వరకు నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో పదిలపరిచాను . నా సత్య స్వరుపమా ! బొమ్మలు వేయడం నా చేత కాదు . చేతనైతే నా కలలను నా మనోభావాలను రంగుల చిత్రాల తో ప్రదిర్శించే వాడిని ఏ చిత్రకారున్ని నేనశ్రాయుంచాను, అందుకు నా మనస్సు సమ్మతించదు. నా అంతరాత్మా ! ఇవిగో నా శబ్ద చిత్రాలు నా మనస్సంగం లో జనించిన ప్రాణ చిత్రలయున ఏ "కలలు + కల్పనలు = నా కవితలు " నీ పదాల చెంత ఉంచుతున్నాను . -ముజీఫ్

Monday, December 14, 2009

నేను కవిని కాదన్నవాడ్ని కత్తితో పొడుస్తా.


ముగ్ధ మోహనం
అమావాస్య చీకటిలోకారడవిలో నడవలేనా?…..నీ నవ్వుందిగా నా వెంట!
*********
అమృతం తో కలిపి అన్నింటినీ ఇచ్చేసినిన్ను మాత్రం దాచేసింది పాలకడలి…..నా కోసం.
*********
ఆ కొలనులో కలువలకినవ్వటం రాదు…..నీ కళ్ళలా.
*********
దేవుడికి ఇంకా అంతు పట్టలేదుసప్తవర్ణాలు కాక ఏ వర్ణం తో చేసాడో…..నిన్ను.
*********
నీలా ఉండాలని ఆ చందమామకి ఎంత ఆశో!పాపం నువ్వే ఒక్కరోజు తనలా ఉండకూడదూ.


1 comment: