[ఇదేమీ క్రొత్త కవితా ప్రయోగం కాదు. సాయం సమయం ప్రకృతి లో జరిగే వర్ణనలు వ్రాసాను. మీలో ఎవరైనా మీ కనుల్లో, కలంలో ఇంకేమైనా దాగొనివుంటే వ్రాయండి. . నాకీ భాష రావటానికి ఎంతో తోడ్పడిన వారి కి ప్రతి మాట నాకు స్ఫూర్తే! ]
అదేమీ అవే ఉదయాలు సాయంత్రాలు
కానీ మదేమో చేయు చిత్రవిచిత్రాలు
తూరుపు కన్నియ కానుకిచ్చిన వెచ్చదనం
గడప గడపకీ పంచి,
పడమర కాంతకి కబురు పంపి
ఆమె కౌగిలి చేరగ పరుగులు తీసే సూరీడు
ఉదయాలు, మాగాణుల్లో తిరుగాడి
గరువు భూముల్లో ఆటలాడుకొని
కాలువ నీటిలో మునక వేసి
సాయంకాలం ఇంటిదారి పడుతూన్నాయి గోగణాలు
గూడు విడవనంటే చెల్లునా?
మేత వెతుకుట తప్పునా?
ఎగిరి ఎగిరి అలిసిన రెక్కలు
గూటికి చేరు సాయం వేళలు
గూటిలో కూనల కువకువలు
అమ్మ వొడి కొరకు ఆనవాళ్ళు
అక్కున చేర్చుకొను అమ్మనాన్నలు
అరుదెంచు వేళలీ సాయంసంధ్యలు
జాజుల రాత్రులు, జావళి పాటలు
జంట హృదయాల తుంటరి సరాగాలు
జాబిలి నవ్వులు, వెన్నెల జాగారాలు
వేకువ కలలు, నిత్యజీవన రేయింబవళ్ళు
అదేమో అవే కాల గమనాలు
మరేమో ఇవే చిరు కవనాలు
********************************
కవిత్వమన్నది మనం సంపాదించుకుంటే రాదు. దానికి పూర్వ జన్మ సుకృతం కావాలి. నిశ్చితాభిప్రాయాలు, నిలకడైన మనసు కావాలి. కవిత్వానికి మన చుట్టూ వాతావరణము, తెలిసిన వారి జీవిత సత్యాలు ఉపకరిస్తాయి. సాహిత్యము, కవితా స్రవంతి రెండూ సమపాళ్ళలో నడపటంలోనే వుంది కవిహృదయం. సాయంసమయమైంది అనేదాన్ని గురించి ఎంతో రాయవచ్చు. సూర్యుడు తన పడమర కాంతను చేరే వేళ అయింది. గోగణము ఇంటికివచ్చే సమయమయింది. పక్షులు ఆహారము వెదుక్కుంటూ వెళ్ళి తమ నివాసములు అంటే గూళ్ళకు చేరే సమయమయింది. చిన్న పక్షికూనలు తెల్లితండ్రుల ఆగమనమునకు ఎదురు చూసేవేళయింది.
*******************************
కనుక మీకు అర్థం అయిపోయింది కదూ, ఆ చివరి ఆరు పంక్తుల చమత్కారం నా మనసుదని. :)
కలలు + కల్పనలు = నా కవితలు
ఆమెను చూసింది మొదలు
ఎడారి పాట నా చెవి లో సోకినా
ఈ క్షణం వరకు
నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక
పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో
పదిలపరిచాను .
నా సత్య స్వరుపమా !
బొమ్మలు వేయడం నా చేత కాదు .
చేతనైతే నా కలలను
నా మనోభావాలను
రంగుల చిత్రాల తో
ప్రదిర్శించే వాడిని
ఏ చిత్రకారున్ని
నేనశ్రాయుంచాను,
అందుకు నా మనస్సు సమ్మతించదు.
నా అంతరాత్మా !
ఇవిగో నా శబ్ద చిత్రాలు
నా మనస్సంగం లో
జనించిన ప్రాణ చిత్రలయున
ఏ "కలలు + కల్పనలు = నా కవితలు "
నీ పదాల చెంత ఉంచుతున్నాను .
-ముజీఫ్
Nice one..!
ReplyDeleteCheck the below lines...and consider for reframing..
"ఉదయాలు, మాగాణుల్లో తిరుగాడి"
...గూటిలో కూనల కువకువలు
అమ్మ వొడి కొరకు "ఆనవాళ్ళు"(>??)
thanqs
ReplyDeleteసూరీడి పరుగుల్లో కూడా కాంతల్ని చొప్పించి మెప్పించిన భావుకత,
ReplyDeleteగోగణాల పొట్టతిప్పల్లో,విశ్రాంతిలో ఆటపాటల్ని కలగలిపి ఇంటిదారి పట్టించిన వైనం,రెక్కల అలసటని గుర్తించగల ఔదార్యం... బహుధాప్రశంసనీయాలు.
మీ భావాలు అందరి హృదయపీఠాలు ఆవిష్కరించాలని ఆకాంక్షిస్తున్నాను.
http://telugukala.blogspot.com
తెలుగుకళ - పద్మకళ