ఆ అనుభవాలన్నీ జ్ఞాపకాలుగానే మిగిలిపోయాయి.....
ఇన్నాళ్ళు చదువు..ఉద్యోగం పేరుతో టౌన్ దాటని నేను పల్లెల్లో కళ ఇంతలా ఒట్టిపోయి ఉంటుందనుకోలేదు..
ఎన్ని ఊళ్ళు తిరిగినా నా చిన్నతనంలో పల్లెల్లో ఉన్న కళ కళలు నేడు మచ్చుకైనా కానరావడంలేదు... రచ్చబండలు లేవు...చెక్కబజనలు లేవు..
ఎరువాకలు లేవు...వెన్నెట్లో ఆటలు లేవు.......
ఎక్కడ ఎదురైనా బక్కచిక్కిన బసవన్నలే ......
హరిదాసుల సంకీర్తనలు పాపులర్ సినిమా పాటల రాగాల్లోనే వినిపిస్తున్నాయ్...
బోగిమంటలు లాంచన ప్రాయమైపోయాయి..
అరుగులమీద పిల్లల్ని కూర్చుని పెట్టుకుని కథలు చెప్పే మామ్మలు మాయదారి సీరియల్లకోసం టీవిలకు అతుక్కుపోతున్నారు....
గట్టు మీద చెమ్మచెక్కలు..రచ్చబండమీద అచ్చనకాయలు.....
దాదాపు పాతికేళ్ళనాటి జ్ఞాపకాల్లో తప్ప ఇప్పుడు కనబడడం లేదు...
నా చిన్నప్పుడు ఇవన్నీ చూసినవడనీ....మళ్లీ ఎక్కడైనా కనబడకపోతాయా అని ఆశగా ఎదురు చూస్తున్నవాడినీ.....
కలలు + కల్పనలు = నా కవితలు
ఆమెను చూసింది మొదలు
ఎడారి పాట నా చెవి లో సోకినా
ఈ క్షణం వరకు
నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక
పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో
పదిలపరిచాను .
నా సత్య స్వరుపమా !
బొమ్మలు వేయడం నా చేత కాదు .
చేతనైతే నా కలలను
నా మనోభావాలను
రంగుల చిత్రాల తో
ప్రదిర్శించే వాడిని
ఏ చిత్రకారున్ని
నేనశ్రాయుంచాను,
అందుకు నా మనస్సు సమ్మతించదు.
నా అంతరాత్మా !
ఇవిగో నా శబ్ద చిత్రాలు
నా మనస్సంగం లో
జనించిన ప్రాణ చిత్రలయున
ఏ "కలలు + కల్పనలు = నా కవితలు "
నీ పదాల చెంత ఉంచుతున్నాను .
-ముజీఫ్
No comments:
Post a Comment