శిధిల ప్రపంచంలో
ఎంత స్వార్ధమే ప్రేమా నీకు
మనిషిని మాయ చేసి ఆడిస్తావు
మనసుకేదో మత్తుజల్లి
బాధలన్నీ మరచిపోయే స్వప్నలోకం చూపిస్తావు
అమృతాలనే అందిస్తావు
వాలుకనులతో కవ్విస్తావు
చిన్ని నవ్వుతో మనసే దోచేస్తావు
కవ్విస్తావు... నవ్విస్తావు...
అంతలోనే చీకటి ఒడిలో వదిలేస్తావు
మతం పేరుతో, కులం పేరుతో విడదీస్తావు...
జాతులు వేరంటూ తరిమేస్తావు
చివరకు ప్రాణమైనా తీస్తావు
ప్రేమంటే ఇంతేనా...?
ప్రతి క్షణమూ చింతేనా??
ఎంత స్వార్ధమే ప్రేమా నీకు
నా మనసునెందుకిలా వేధిస్తావు?
మనిషిని మాయ చేసి ఆడిస్తావు
మనసుకేదో మత్తుజల్లి
బాధలన్నీ మరచిపోయే స్వప్నలోకం చూపిస్తావు
అమృతాలనే అందిస్తావు
వాలుకనులతో కవ్విస్తావు
చిన్ని నవ్వుతో మనసే దోచేస్తావు
కవ్విస్తావు... నవ్విస్తావు...
అంతలోనే చీకటి ఒడిలో వదిలేస్తావు
మతం పేరుతో, కులం పేరుతో విడదీస్తావు...
జాతులు వేరంటూ తరిమేస్తావు
చివరకు ప్రాణమైనా తీస్తావు
ప్రేమంటే ఇంతేనా...?
ప్రతి క్షణమూ చింతేనా??
ఎంత స్వార్ధమే ప్రేమా నీకు
నా మనసునెందుకిలా వేధిస్తావు?
No comments:
Post a Comment