కలలు + కల్పనలు = నా కవితలు

ఆమెను చూసింది మొదలు ఎడారి పాట నా చెవి లో సోకినా ఈ క్షణం వరకు నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో పదిలపరిచాను . నా సత్య స్వరుపమా ! బొమ్మలు వేయడం నా చేత కాదు . చేతనైతే నా కలలను నా మనోభావాలను రంగుల చిత్రాల తో ప్రదిర్శించే వాడిని ఏ చిత్రకారున్ని నేనశ్రాయుంచాను, అందుకు నా మనస్సు సమ్మతించదు. నా అంతరాత్మా ! ఇవిగో నా శబ్ద చిత్రాలు నా మనస్సంగం లో జనించిన ప్రాణ చిత్రలయున ఏ "కలలు + కల్పనలు = నా కవితలు " నీ పదాల చెంత ఉంచుతున్నాను . -ముజీఫ్

Tuesday, December 1, 2009

ప్రేమికుల రోజుకు చిహ్నానివైన నీకు --> Comment Plz

కనులకు కనిపించని కమ్మనయిన ప్రేమా!
మనసును మురిపించే మధురమయిన ప్రేమా!
శిధిలమైన హృదయాల్లో సునామిలా చేరి,
చిలిపిగా చిగురించే ప్రేమా!
పడవకు తెర చాప తోడులా
హృదయానికి నిత్యం తోడుండే ప్రేమా!
భాషాభేదాలను మరచే లా
కుల మతాలను వదిలే లా
నేస్తాలే సాక్షాలుగా
స్వచమైన హృదయాలే ప్రతీకగా
కదిలే ప్రేమా!
నిను స్పృశించని మనిషే లేదమ్మా ఈ లోకం లో అయినా
కాలకూట విషాన్ని దాచిన శివునికే సాధ్యం కాలేదు నిను దాచడం
అందుకే వదిలాడు నిను ఈ భూమిపై!

అందమైన అనుభూతులను పంచుకోవడానికి
అధరామ్రుతాలను స్వీకరించడానికి
కనులలో కమ్మనైన భావాలను పలికించడానికి
నా చిన్ని హృదయానికి ఓ అవకాశం ఎప్పుడు ఇస్తావమ్మ!
నాకు హృదయ కోత మిగల్చవనే చిరు ఆశ తో ,
ప్రేమికుల రోజుకు చిహ్నానివైన నీకు నా నీరాజనాలు నేస్తం!


No comments:

Post a Comment