చెలీ !
కాళిదాసు కలం నుండి జాలువారిన ఏ కావ్యానివో నువ్వు.
నా కనుల చివర నిలిచిన కన్నీటి ముత్యాణివో నువ్వు.
మేఘం అంచున దాగిన తొలిచిరు చినుకువో నువు.
నా హృదయంలో స్వప్నమై అల్లరిచెస్తున్నావు.
సూర్యుడు ఉదయించేవేల సుప్రభాతంలా...
చంద్రుడు కనిపించేవేల వెనుగానంలా....
మల్లెలు వికసించేవేల సుగంధంలా...
నా మనస్సు స్పందించే వేల మనోగేతంలా ...
ఎందుకు నా మదిలో ఇంత అలజడి రేపుతున్నావు......?
కలలు + కల్పనలు = నా కవితలు
ఆమెను చూసింది మొదలు
ఎడారి పాట నా చెవి లో సోకినా
ఈ క్షణం వరకు
నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక
పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో
పదిలపరిచాను .
నా సత్య స్వరుపమా !
బొమ్మలు వేయడం నా చేత కాదు .
చేతనైతే నా కలలను
నా మనోభావాలను
రంగుల చిత్రాల తో
ప్రదిర్శించే వాడిని
ఏ చిత్రకారున్ని
నేనశ్రాయుంచాను,
అందుకు నా మనస్సు సమ్మతించదు.
నా అంతరాత్మా !
ఇవిగో నా శబ్ద చిత్రాలు
నా మనస్సంగం లో
జనించిన ప్రాణ చిత్రలయున
ఏ "కలలు + కల్పనలు = నా కవితలు "
నీ పదాల చెంత ఉంచుతున్నాను .
-ముజీఫ్
No comments:
Post a Comment