కలలు + కల్పనలు = నా కవితలు

ఆమెను చూసింది మొదలు ఎడారి పాట నా చెవి లో సోకినా ఈ క్షణం వరకు నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో పదిలపరిచాను . నా సత్య స్వరుపమా ! బొమ్మలు వేయడం నా చేత కాదు . చేతనైతే నా కలలను నా మనోభావాలను రంగుల చిత్రాల తో ప్రదిర్శించే వాడిని ఏ చిత్రకారున్ని నేనశ్రాయుంచాను, అందుకు నా మనస్సు సమ్మతించదు. నా అంతరాత్మా ! ఇవిగో నా శబ్ద చిత్రాలు నా మనస్సంగం లో జనించిన ప్రాణ చిత్రలయున ఏ "కలలు + కల్పనలు = నా కవితలు " నీ పదాల చెంత ఉంచుతున్నాను . -ముజీఫ్

Saturday, July 17, 2010

నీ జ్ఞాపకం
మలయమారుతమై చందనాలను   వెదజల్లుతుంది ఒకసారి  
నా ప్రేమ 
రగిలిపోతూ నిప్పులవర్షం కురిపిస్తుంది మరొకసారి
ఎందుకో అర్థం కాక నిన్నడగాలనుకున్నా  
తపన సిరాతో నిండిన నా హృదయాన్ని
అనుభూతి కాగితం మీద అలా ఆన్చానో లేదో...
కాగితం చిరిగిపోయింది, సిరా ఒలికిపోయింది 
నా జీవన మధుభాoడమే  మట్టిపాలయిందని తెలుసు 
కనీసం నీ చుట్టూ  అల్లుకున్న నా మనసయినా నీకర్పిద్దామనుకుంటే
అపార్థాల అగ్నిలో దగ్ధమై బూడిదే మిగిలింది 

No comments:

Post a Comment