కలలు + కల్పనలు = నా కవితలు

ఆమెను చూసింది మొదలు ఎడారి పాట నా చెవి లో సోకినా ఈ క్షణం వరకు నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో పదిలపరిచాను . నా సత్య స్వరుపమా ! బొమ్మలు వేయడం నా చేత కాదు . చేతనైతే నా కలలను నా మనోభావాలను రంగుల చిత్రాల తో ప్రదిర్శించే వాడిని ఏ చిత్రకారున్ని నేనశ్రాయుంచాను, అందుకు నా మనస్సు సమ్మతించదు. నా అంతరాత్మా ! ఇవిగో నా శబ్ద చిత్రాలు నా మనస్సంగం లో జనించిన ప్రాణ చిత్రలయున ఏ "కలలు + కల్పనలు = నా కవితలు " నీ పదాల చెంత ఉంచుతున్నాను . -ముజీఫ్

Saturday, July 17, 2010

****మరణ మృదంగం ****

ఒకప్పుడు నీవిచ్చిన ఓదార్పు
ఇప్పుడు నిన్ను మోస్తున్నది
వారి భుజాలపై,;

నీవారు   అనుకున్న నీ సామ్రాజ్యం
తోడొస్తున్నది   నీతో
నిన్ను కాటిలో వదిలేయడానికై ;

నవ్వుతూ నీవు పలికేపలుకులు
ఉపయోగపడుతున్నవీ     నీ
చావు రహస్యాన్ని పరామర్శించడానికే ;

దన స్దలాల కోసం
వాదులాడుతున్న నీ వాదం మిగిల్చింది
నీకు 7 అడుగుల స్దలాలను మాత్రమే,

అష్టమదాలతో రగిలిపోయే నీ కోపం
బహుశా ! సిద్దమైనది నిన్ను కాల్చి
మాయచేసేందుకై ;

అందమే ఆనందం అనుకునే   నీ తనువు
పాపం!   చూడబోతున్నది నల్లని నీ
బూడిద   ముద్రికను మాత్రమే ;

*కాని ఇతరులకై నీవు వదిలే
కన్నిటి బొట్టు వినియోగపడుతుంది
వెలిగించేందుకు అందరి మదిలోను నీ జ్ఙాపక దీపాన్ని

అందుకే ....
గమనించు నీ జీవితాన్ని
పరిశీలించు నీ కర్తవ్యాన్ని,
పయనించు తుది వరకూ
వెతుకుతూ నీ గమ్యాన్ని.

No comments:

Post a Comment