కలలు + కల్పనలు = నా కవితలు

ఆమెను చూసింది మొదలు ఎడారి పాట నా చెవి లో సోకినా ఈ క్షణం వరకు నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో పదిలపరిచాను . నా సత్య స్వరుపమా ! బొమ్మలు వేయడం నా చేత కాదు . చేతనైతే నా కలలను నా మనోభావాలను రంగుల చిత్రాల తో ప్రదిర్శించే వాడిని ఏ చిత్రకారున్ని నేనశ్రాయుంచాను, అందుకు నా మనస్సు సమ్మతించదు. నా అంతరాత్మా ! ఇవిగో నా శబ్ద చిత్రాలు నా మనస్సంగం లో జనించిన ప్రాణ చిత్రలయున ఏ "కలలు + కల్పనలు = నా కవితలు " నీ పదాల చెంత ఉంచుతున్నాను . -ముజీఫ్

Saturday, July 17, 2010

::::::::::::::::జీవితం::::::::::::::::::


కష్హాలు కన్నీటి రూపంలో
నిన్ను కౌగిలించుకొని
నీ కనులకు ఏవి కనపడనీయకుండా చేస్తున్నవా?
నీ సంకల్పంతో వాటిని
తుడచి కనులు కదిలించి చూడు
మరో కొత్త ఆశయం నీ కనులముందరే కనిపిస్తుంది....
బాదలు మనుషుల మాటలలో,
వచ్చి నీ మనసును గాయపరచి
నీ మనస్దైర్యాన్ని మూగపరచేట్లు చేసినవా?
అంతకు మించిన ఆశయ దీక్షతో
విదిని ఎదిరించి వెంటాడు,
విజయం నీ వెనుకాలే నిన్ను వెంబడిస్తుంది.
అదృష్టం అనే అర్హతతో,
లోకం నిన్ను వెలివేస్తున్నదా?
లక్ష్యంకు ఉండవలసినది ఆశే కాని
అర్హత కాదని వెలుగెత్తి చాటు.....
అరాచకాలని అరికట్టి
గెలుపు అనే శిఖరాలపై నిలబడి ఆకాశాన్ని అందిచూడు...
నిజమైన జీవితం చేతికందుతంది

No comments:

Post a Comment