కలలు + కల్పనలు = నా కవితలు

ఆమెను చూసింది మొదలు ఎడారి పాట నా చెవి లో సోకినా ఈ క్షణం వరకు నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో పదిలపరిచాను . నా సత్య స్వరుపమా ! బొమ్మలు వేయడం నా చేత కాదు . చేతనైతే నా కలలను నా మనోభావాలను రంగుల చిత్రాల తో ప్రదిర్శించే వాడిని ఏ చిత్రకారున్ని నేనశ్రాయుంచాను, అందుకు నా మనస్సు సమ్మతించదు. నా అంతరాత్మా ! ఇవిగో నా శబ్ద చిత్రాలు నా మనస్సంగం లో జనించిన ప్రాణ చిత్రలయున ఏ "కలలు + కల్పనలు = నా కవితలు " నీ పదాల చెంత ఉంచుతున్నాను . -ముజీఫ్

Saturday, July 17, 2010

మద్యతరగతి బతుకులివీ...


తీరలేని మా ఆశల వెనుక
తిరిగి రాని ఆ రోజులు ఎన్నో.....
చెప్పుకొనే ఈ సంతోషాల్లో
చెప్పలేని మా సమస్యలెన్నో......
మౌనమనే మా మనసు గదుల్లో
దాగి ఉన్న మా దుఃఖాలెన్నో...
మనసు పడే ఈ వేదన వెనుక
మరపు రాని ఆవేదనలెన్నో....
తెరచి ఉన్న ఈ మసక తెరల్లో
తెరవలేని ఆ తలుపులు ఎన్నో.......
మిగిలి ఉన్న ఈ భావన వెనుక
మింగలేని మా బాదలు ఎన్నో.......
మా మద్యతరగతి బతుకుల మద్య
అవసరమైనవి అనుబందాలే....
అంతే గాని ఆస్తులు కావు...
మా సంద్రానికి తీరముండదు.....
మా రవికిరణం అస్తమించదు..
మా రథ చక్రం విశ్రమించదు....

No comments:

Post a Comment