కలలు + కల్పనలు = నా కవితలు

ఆమెను చూసింది మొదలు ఎడారి పాట నా చెవి లో సోకినా ఈ క్షణం వరకు నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో పదిలపరిచాను . నా సత్య స్వరుపమా ! బొమ్మలు వేయడం నా చేత కాదు . చేతనైతే నా కలలను నా మనోభావాలను రంగుల చిత్రాల తో ప్రదిర్శించే వాడిని ఏ చిత్రకారున్ని నేనశ్రాయుంచాను, అందుకు నా మనస్సు సమ్మతించదు. నా అంతరాత్మా ! ఇవిగో నా శబ్ద చిత్రాలు నా మనస్సంగం లో జనించిన ప్రాణ చిత్రలయున ఏ "కలలు + కల్పనలు = నా కవితలు " నీ పదాల చెంత ఉంచుతున్నాను . -ముజీఫ్

Saturday, July 17, 2010

నీ కోసమై....

అవును !!
నీ  జ్ఞాపకాల కొలిమిలో
కాలుతున్నది నేనే!!
ఎన్నాళ్ళీ  నిరీక్షణ ??
...............
రాలేవా?
అలసిన నా మనస్సనే ఆకాశంలో కి
అరవిరియిన ఇంద్రధనుస్సువై
అక్షరం లాంటి నన్ను కావ్యం గా మార్చిన  వాగ్దేవి వై..
నువ్వెపుడూ ఇంతే !!
చిన్నప్పుడు అమ్మ దాచే తాయిలం
ఇప్పుడు నీ కోసం ఈ నిట్టూర్పులు..
ఎన్నో  నిశ్శబ్దాల గుస గుసలు
ఇంకెన్నో మాట్లాడే చూపులు
ఎన్నో చూపుల రాతలు...
అవును....నిన్ను చూడగానే
నా కళ్ళు ప్రేమాక్షరాలని అచ్చు వేస్తూ ఉంటాయి
ఎదురు చూపులే
ఉచ్చ్వాస  నిశ్వాసాలుగా
నీ ముందు ఎదను పరిచిన
నీ  నేను!!

No comments:

Post a Comment