కదిలిపోయే కెరటం లా
సాగిపోయే నావ లాంటి
జీవితానికి
ఆశల హరివిల్లులు
విరచిమ్ముతూ
ఆప్యాయంగా పలకరించే
మిత్రుడు ఒకడుంటే చాలు
అరుణోదయ సంధ్యల లోగిలిలో
సుఖ దుఃఖాల జీవిత సంగ్రామం లో
చివరికి మిత్రుడే
మిగిలిన బంధువు!!!
మరో మహోదయం
నా కోసం ఉదయిస్తే , మరో జన్మ నాకు
మిగిలి ఉంటే మంచి మిత్రుడి
మమతానురాగాల కోసం
అస్తమించడానికైనా
ఆనందమే!!
No comments:
Post a Comment