కలలు + కల్పనలు = నా కవితలు

ఆమెను చూసింది మొదలు ఎడారి పాట నా చెవి లో సోకినా ఈ క్షణం వరకు నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో పదిలపరిచాను . నా సత్య స్వరుపమా ! బొమ్మలు వేయడం నా చేత కాదు . చేతనైతే నా కలలను నా మనోభావాలను రంగుల చిత్రాల తో ప్రదిర్శించే వాడిని ఏ చిత్రకారున్ని నేనశ్రాయుంచాను, అందుకు నా మనస్సు సమ్మతించదు. నా అంతరాత్మా ! ఇవిగో నా శబ్ద చిత్రాలు నా మనస్సంగం లో జనించిన ప్రాణ చిత్రలయున ఏ "కలలు + కల్పనలు = నా కవితలు " నీ పదాల చెంత ఉంచుతున్నాను . -ముజీఫ్

Saturday, July 17, 2010

"(స్త్రీ)" శ్రీకారం


స్త్రీ!!!

చిన్నప్పట్నుంచి వింటున్న పేరు,

ఒక అమ్మ గా ఒక అక్క గా ,ఒక చెల్లిగా ,ఒక చెలిగా

మనిషి లో ఒక భాగమైన ఈ "షి" ఒక ప్రయాణం....ఒక ప్రమాణం

తనకన్ని తేదీలు గుర్తుంటాయి ... తన పుట్టినరోజు తప్ప

అవును మరి

బతుగు పొగలతో ఆమె జీవితపు క్యాలెండరు మసి బారింది..

ఎక్కడున్నావమ్మా???

నీ బ్రతుకుని మాకు మెతుకులుగా తినిపించి పస్తులున్న పడతీఎక్కడ నీ చిరునామా??

కట్నం కుమ్ములాటలో ప్రేమ పేరు తో మరిగే విష కషాయం లో కరిగి ,

చెల్లదు అని కొట్టేసిన కేసు స్త్రీ!!!

అవును మరి మనది "Mr. రాజ్యం " !!.

రాముడు ఎన్ని యుద్ధాలు చేయాలో ??

అందరూ రావణాసురులే అంతటా....

ఒక్కటి మాత్రం నిజం ..

మనిషి గతం లో " తను" ఉంది

వర్తమానం లో "తను" ఉంది

భవిష్యత్తు లో కూడా ఉంటూ

"అతను" లో అన్నీ "తను" అయిన విజేత ఈ వనిత...

యుగపురుషుడు ఒక్కడే ....

మిగతావాళ్ళందరూ స్త్రీ లే మరి...లెక్కకందనంతమంది..

సహనం చెలికత్తెగా బాధలు అనే కలుపుమొక్కలను ఏరుతూ

కన్నీళ్ళతో చేసే బతుకు వ్యవసాయం స్త్రీ ...

ఏరుతోంది పారేసుకున్న ధాన్యం కాదు..

మగవాడి పరువు తాలూకు గుర్తులు

అందుకే

స్త్రీ లేని ప్రపంచం

పేజీలు లేని పుస్తకం లాంటిది..

అక్షరాలు లేని భాష లాంటిది

అర్థం ఉండదు.....అనర్థం తప్ప....

అందుకే ....ఓ స్త్రీ !!

నీకు అభిమాన అభివందనం !!!

మమకార సిరి చందనం !!!!

No comments:

Post a Comment