కలలు + కల్పనలు = నా కవితలు

ఆమెను చూసింది మొదలు ఎడారి పాట నా చెవి లో సోకినా ఈ క్షణం వరకు నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో పదిలపరిచాను . నా సత్య స్వరుపమా ! బొమ్మలు వేయడం నా చేత కాదు . చేతనైతే నా కలలను నా మనోభావాలను రంగుల చిత్రాల తో ప్రదిర్శించే వాడిని ఏ చిత్రకారున్ని నేనశ్రాయుంచాను, అందుకు నా మనస్సు సమ్మతించదు. నా అంతరాత్మా ! ఇవిగో నా శబ్ద చిత్రాలు నా మనస్సంగం లో జనించిన ప్రాణ చిత్రలయున ఏ "కలలు + కల్పనలు = నా కవితలు " నీ పదాల చెంత ఉంచుతున్నాను . -ముజీఫ్

Saturday, July 17, 2010

నేను c /o నువ్వు

అవును నేనే !!
నువ్వెప్పుడు వస్తావా అని  "విరహం"  అనే  మరణ శయ్య పై 
ఎదురుచూస్తున్నది ...................నేనే!!!
క్షణాలని కాపలాగా పెట్టి 
నీ రాక కోసం అందరినీ అడిగి ,అడిగి
నోరెండిపోయిన ప్రేమ నది ని  నేనే మరి !!!
ఏం చేయను???
నువ్ వెళ్ళి ఒక్క రోజైనా , నాకు మాత్రం
మూడు కాలాలు,ఆరు ఋతువులు ,చివరగా
లక్ష  నిస్పృహలు గా   అనిపిస్తోంది ....

ఎందుకు? ఎందుకు  నీ కింత నిర్దయ నా మీద ...!
శరీరం ఇచ్చి ప్రాణం తీసుకు పోయావ్ !!!
మనసు ఇచ్చి జ్ఞాపకాలని తీసుకు పోయావ్!!!!!
రాలేవా ??......... ఒక్కసారి  నా కోసం 
అలిసిపోయిన  ఆకాశం లాంటి నాకు 
అరవిరిసిన నిండు పున్నమివై   !! 
నీతో మాట్లాడకుండా  మూగపోయిన  నా నోటికి
నీ నామావధానం  చేసే  ప్రేమ పలుకు వై !!
చివరగా............
నన్ను బ్రతికించ డానికి  కావల్సింది  ప్రాణ వాయువు కాదు ..........
నీ ప్రేమ వాయువు !!!
ఇట్లు........... 
నీ కోసం ఎదురు చూసే 
ప్రేమ జ్ఞాపకాలని ముద్రించుకున్న  నీ మనసు  జ్ఞాపికను..............................

No comments:

Post a Comment