నీ తోడే లేనపుడు
కాంతులను వెదజల్లని నాడు, వెన్నెలకు పున్నమి ఎందుకు
రాగాలను పలకలేనినాడు, కోయిలకు వసంతాలెందుకు
సువాసనలు విరజిమ్మనపుడు , పువ్వుకి ఆ రంగులెందుకు
నీ తోడే నాకు లేనపుడు ఈ జన్మకు బ్రతుకెందుకు.
కదిలిపోని జీవితం అమావాస్య చంద్రుడిలాగ
రాలి పోనీ జీవితం వాడి పోయే పువ్వులాగ ......
ఈ జన్మకు
నేనొక చంద్రున్నని, అందులో నా మనసొక ఆకాశామని
నే పలికే పలుకులు చుక్కలని, నే నవ్వే నవ్వులు వాటి వెలుగులని
ఆ వెలుగుల్లో నీవు తడిసిపోవాలనే అందమైన పలుకులు పలికి,
మనసులోతుల్లో ఆరని ప్రేమజ్యోతులను వెలిగించావు
నేడు ఆ జ్యోతులు నను నిలువునా కాల్చివేసినా
లేక నను నిలువునా మసిచేసినా
వాటి వెలుగుల్లో నీ నిలువెత్తు రూపం నాట్యం చేస్తూ మురిసిపోతుంటే
ఆ మురిపెంతో ని చిరు పెదవులపై ముసి ముసి నవ్వులు తాండవిస్తుంటే
చాలదా ఈ జన్మకు జీవితం
చాలదా ఈ జన్మకు దానిలో కలిగిన ఆనందం
చాలదా ఈ జన్మకు ఆ ఆనందం లో కలిగిన పరవశం
చాలదా ఈ జన్మకు కారణమైన ఆ నా ఒక్క క్షణం
ఇంద్రియాలు లేని మనసు
నా తనువులో వున్న పంచేంద్రియాలు
అవి చూసే చూపు బట్టి, వినే మాటలను బట్టి
తాకే స్పర్శను బట్టి, పీల్చే వాసను బట్టి
నడిచే నడతను బట్టి, చేసే చేతలను బట్టి
తేడాలను కనిపెట్టి, నా గమనాన్ని నిర్ధేశించగలవు ,
కాని
నిను వలచిన నామనసుకి ఈ తేడాలు తెలియదు ప్రియా ..దానికి
ఉక్రోశంతో కోపాన్ని చూపించినా,ఉల్లాసంతో తీయని మాటలు వినిపించినా
ఉద్రేకంతో నిలువునా అగ్నికి దహన మిచ్చినా,
వెచ్చని ఉపిరిలను యదపైకి ప్రవహింపచేసినా,
చేతిలో చేయి పట్టి ఉన్నత మార్గాలకు నడిపించినా
ఆ దారిలో ముల్లదారిని పట్టించినా
ప్రేమిచడం తప్ప ఏమి చేయలేని
మూగది, చెవిటిది
గుడ్డిది ,కదలలేని అవిటది
ఎప్పుడు ఏమౌనో
రోజుకొకసారి రగిలే ప్రళయాగ్నులు నీకు తెలుసా
గంటకొకసారి పుట్టుకొచ్చే చల్లని మంచు పర్వతాలు తెలుసా
నిమిషానికి ఒకసారి విరబుసే పుష్పాలు నీకు తెలుసా
అర క్షణానికే వాడిపోయే సువాసనలు తెలుసా
ఇవన్ని కలసి ఒకే చోట జరిగే ఆ చోటు తెలుసా
ఆ చోటు నా మదిలో నిక్షిప్తమైతే
అది పడే బాధ తెలుసా
ఆనందానికి కారణం వుండదు ,బాధకు కారణం వుండదు
నవ్వుకి కారణం వుండదు , కారే కన్నిటికి కారణం వుండదు
ఇలా ఏ కారణం లేకుండా సాగే జీవితాన్ని
కారణం లేకుండా నా జీవితానికి ఆపాదించి
కనిపించని దూరాలకు కానరాకుండా కనుమరుగైపోయావు
ఎలా ప్రియా నన్ను నేను మార్చుకోనేది
ఎలా నిన్ను మరచిపోయేది
ఏదైతే ఏంటి
నడుస్తున్న కాలం
వసంతమైతే ఏంటి, ,గ్రీష్మం ఐతే ఏంటి
గడుస్తున్న సమయం
పగలైతే ఏంటి, రాత్రైతే ఏంటి
వెళ్తున్న దారుల్లో
ముల్లకంపలుంటే ఏంటి, తివాచీలు పరిస్తే ఏంటి
నిలచున్న చోటులో
శ్మశానాలు వుంటే ఏంటి ,పచ్చని పైర్లుంటే ఏంటి
నా మనసుకు నచ్చిన చెలి నా తోడుని కోరి
నా జన్మకు నీడగా వచ్చి చేరాక....జీవితం
వసంతమవదా ప్రతి కాలం
వెన్నెలలు కురియవా ప్రతిసమయం
పూల పరదాలు పరచదా ప్రతి దారి
ఉద్యానవనాలు కావా ప్రతి చోటు
No comments:
Post a Comment