కలలు + కల్పనలు = నా కవితలు

ఆమెను చూసింది మొదలు ఎడారి పాట నా చెవి లో సోకినా ఈ క్షణం వరకు నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో పదిలపరిచాను . నా సత్య స్వరుపమా ! బొమ్మలు వేయడం నా చేత కాదు . చేతనైతే నా కలలను నా మనోభావాలను రంగుల చిత్రాల తో ప్రదిర్శించే వాడిని ఏ చిత్రకారున్ని నేనశ్రాయుంచాను, అందుకు నా మనస్సు సమ్మతించదు. నా అంతరాత్మా ! ఇవిగో నా శబ్ద చిత్రాలు నా మనస్సంగం లో జనించిన ప్రాణ చిత్రలయున ఏ "కలలు + కల్పనలు = నా కవితలు " నీ పదాల చెంత ఉంచుతున్నాను . -ముజీఫ్

Saturday, July 17, 2010

1)   రమణీయం ..కమనీయం ..ని దరహాసం 
అనిర్వచనీయం అద్బుతం ని రూపం 
నాట్య మయూరం  కడలి జలపాతం ని  వోయ్యారం,
సుమ సుందరం సుమం ని నామం
కదిలే ఓ వెండి వెన్నెల 
ఇలకే వన్నె తెచ్చిన, ఓ కుంధనవదన,
ఈలోకంలో ని చిరునామా ఎక్కడ ...!    
* * * ముజీఫ్ * * *
2)   వాలు కళ్ళ వోయారమ,
సుగంధాలు ఒలికే సోయగమా . .
మ్రుదుమనోహరమైన   రూపపు లావన్యమా ,
తేనేలోలుకే మాటల  తీయధనమా  ..

కవ్వించే   కోరికల కంగారుతనమా  ,
మైమరపించే  నా  సప్త రాగాల  సంగీత  సౌధమా  ..

ని ఉహల ఉహ్శాసుల  జాడ    తెలుపుతు
ని కౌగిలిలో వోదిగిపోఏ వరమీయుమ  జన్మజన్మకి  ..  
* * * ముజీఫ్  * * * 
3)  కనురేపల  మాటున ,
కళల  చెంతన ,
నా  ఉహల  ఆశలతో .. కవించేయ్  వో  కొంటి  కోణంగి ,
మురిపించి  నన్ను   మైమరపించే   వో మోహనాంగి ,
ని  సొగసుల  సౌందర్యని, 
ని తుంటరి  వయసులోని  కంగారుతానన్ని, 
నామనసుతో  జతచేయవ! ... ఎప్పటికీ ...                         * * * ముజీఫ్   * * *

4)   నా  హృదయ  నందనవనంలోని  వసంతమా,
నా వలపు  తోటలోని  సాహిత్యమా,
నా  పెదవి  పాడే    మౌన గితమా,
నన్ను   వెంటాడే   ఓ  నా   కళల  బంధమా,
నన్ను  రచిచపజేసేయ్  ఓ  నా   అక్షర  అలంకారమా  ,
నన్ను  గమనించే   ఓ  ప్రకృతి   నేస్తమా, 
- అందుకో  నా  కవిత  వధానం! 
* * *  ముజీఫ్   * * *
5)  నన్ను వెంటాడే  ని  కలల   తీరం 
నా వేకువ  ఉషాస్సులో  ని  ఉషోదయం
నా ప్రతి  పలుకులో  ని  సాహిత్యం 
నా హృదయ సంగమంలో  ని  స్వర  మధనం
నాకే  సొంతమయ్యే   ని  ప్రేమ  మాధుర్యం 
--- కావాలి  సుమ  జీవితాంతం !
***   ముజీఫ్  ***

No comments:

Post a Comment