కలలు + కల్పనలు = నా కవితలు

ఆమెను చూసింది మొదలు ఎడారి పాట నా చెవి లో సోకినా ఈ క్షణం వరకు నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో పదిలపరిచాను . నా సత్య స్వరుపమా ! బొమ్మలు వేయడం నా చేత కాదు . చేతనైతే నా కలలను నా మనోభావాలను రంగుల చిత్రాల తో ప్రదిర్శించే వాడిని ఏ చిత్రకారున్ని నేనశ్రాయుంచాను, అందుకు నా మనస్సు సమ్మతించదు. నా అంతరాత్మా ! ఇవిగో నా శబ్ద చిత్రాలు నా మనస్సంగం లో జనించిన ప్రాణ చిత్రలయున ఏ "కలలు + కల్పనలు = నా కవితలు " నీ పదాల చెంత ఉంచుతున్నాను . -ముజీఫ్

Saturday, July 17, 2010

నాకెన్ని ఆశలో..


నెస్తమా!
నాకెన్ని ఆశలో ..............
సరిహధ్దు అంతరాలు లేని ఆ నీలాకాశంలో
నాకోవిహంగమై ఎగరాలని వుంది
తపొప్పుల భేషజాలు ఎరుగని పసితనానికి
మరల నాకు పయనమవ్వాలని వుంది
సమాజ అసమానతలకు తావులేని
సామ్రాజ్యానికి నెనో యువరాణినవ్వాలని వుంది
మమతానురాగాలకు బందీలయ్యే
మనసులనడుమే అనునిత్యం వుండాలనుంది
మానవ జీవన సరళిలోని అమలిన
ప్రేమతత్వాన్ని తెలిపే కవితనవ్వాలని వుంది
"నా"అనే ఆలోచన లేని
భాధ్యతలొ అందాన్ని నాకు పొందాలని వుంది
........................
..............................నాకెన్ని ఆశలో..

No comments:

Post a Comment