కలలు + కల్పనలు = నా కవితలు

ఆమెను చూసింది మొదలు ఎడారి పాట నా చెవి లో సోకినా ఈ క్షణం వరకు నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో పదిలపరిచాను . నా సత్య స్వరుపమా ! బొమ్మలు వేయడం నా చేత కాదు . చేతనైతే నా కలలను నా మనోభావాలను రంగుల చిత్రాల తో ప్రదిర్శించే వాడిని ఏ చిత్రకారున్ని నేనశ్రాయుంచాను, అందుకు నా మనస్సు సమ్మతించదు. నా అంతరాత్మా ! ఇవిగో నా శబ్ద చిత్రాలు నా మనస్సంగం లో జనించిన ప్రాణ చిత్రలయున ఏ "కలలు + కల్పనలు = నా కవితలు " నీ పదాల చెంత ఉంచుతున్నాను . -ముజీఫ్

Saturday, July 17, 2010

ఓ నెస్తమా !

నా ఆశకు ఆలాపన నీవె
నా ఊహకు ఊపిరి నీవె!

నా యదకు అభిలష నీవె
నా ఉనికికి ఊతం నీవె!

నా ఆలొచనకు ఆలంభన నీవె
నా ఆచరనకు అధినేత నీవే!


ఈ జీవన పద్మ వ్యూహంలో 
నే పట్టు జారి పడుతున్న నా అశాధివ్వె నువే!
అలసిన మనసుకు సాంతన నువే 
ఆశయాల సంద్రాన చుక్కాని నువే 
అలుపెరుగని పయనాన నా అసలు నేస్తం నువే!


అరె 

నిశీధి శిశిరాన ద్రువతరవైన
ఆనంధ డొలికల్లొ ఆజ్యపు ఆవిరైన 
నీ తలపేగ , నీ తపనేగ .....

నీ శావాసనికేగ ప్రతి మానవ సాహసం
నీ అరాధనెగ ప్రతి మధి కోరె అనుక్ష్నం.........

ఓ విజయమా 

ఈ ఉషకిరనాల పూమాలవయ్ 
నను వరించి 

నా భావాల అర్తివై 
నా పధముల స్పుర్తివై 
ప్రతి గదియ నా తొడుండుండవా.............. 

No comments:

Post a Comment