కలలు + కల్పనలు = నా కవితలు

ఆమెను చూసింది మొదలు ఎడారి పాట నా చెవి లో సోకినా ఈ క్షణం వరకు నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో పదిలపరిచాను . నా సత్య స్వరుపమా ! బొమ్మలు వేయడం నా చేత కాదు . చేతనైతే నా కలలను నా మనోభావాలను రంగుల చిత్రాల తో ప్రదిర్శించే వాడిని ఏ చిత్రకారున్ని నేనశ్రాయుంచాను, అందుకు నా మనస్సు సమ్మతించదు. నా అంతరాత్మా ! ఇవిగో నా శబ్ద చిత్రాలు నా మనస్సంగం లో జనించిన ప్రాణ చిత్రలయున ఏ "కలలు + కల్పనలు = నా కవితలు " నీ పదాల చెంత ఉంచుతున్నాను . -ముజీఫ్

Saturday, July 17, 2010

నాలో సగం

నాలో సగం అవబోతూ

నన్నేతన సర్వస్వం గా అనుకోబోయే

నా అర్థాంగికి

కాలానికి కరిగే కన్నీరుండాలి

ప్రతిదానికి కంపించే మనస్తత్వం ఉండాలి

మరణయాతన పెట్టే మానవత్వం ఉండాలి

అందులో నుండి తప్పించుకునే చురుకుతనం ఉండాలి

మనుషి మనసు వెన్నెలా ఉండాలి

చిగురించిన పుష్పం చెక్కిల్లు

కలువల్లాంటి కళ్ళు

లేలేత జలపాతాల్లాంటి వంపుసొంపులు,

నాగుపాము లాంటి నడుము ఉండాలి.

No comments:

Post a Comment