కలలు + కల్పనలు = నా కవితలు

ఆమెను చూసింది మొదలు ఎడారి పాట నా చెవి లో సోకినా ఈ క్షణం వరకు నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో పదిలపరిచాను . నా సత్య స్వరుపమా ! బొమ్మలు వేయడం నా చేత కాదు . చేతనైతే నా కలలను నా మనోభావాలను రంగుల చిత్రాల తో ప్రదిర్శించే వాడిని ఏ చిత్రకారున్ని నేనశ్రాయుంచాను, అందుకు నా మనస్సు సమ్మతించదు. నా అంతరాత్మా ! ఇవిగో నా శబ్ద చిత్రాలు నా మనస్సంగం లో జనించిన ప్రాణ చిత్రలయున ఏ "కలలు + కల్పనలు = నా కవితలు " నీ పదాల చెంత ఉంచుతున్నాను . -ముజీఫ్

Saturday, July 17, 2010

కనుకనే కన్నిరు ఆపవే చెలి

నువు చిన్న బోవడం చూసి

చినుకు నేలను చేరకుండానే ఎండిపోతుంది

పంచభూతాలు సైతం పారిపోతాయి

ఈ కారణంగా ప్రపంచం ఏమైపోతుందో అన్న భయంతో.......

కనులనుండి కారిన కన్నీరు చూసి

గంగ ఆక్రోశిస్తుంది, తనకంటే పెద్ద సంద్రం

మరొకటి తయరవుతుందేమోనని

చల్లని గాలి మండే మంటై పోతుంది

పలికినంతలోనే ప్రళయం సంభవిస్తుంది.

కనురెప్పలు వాలి పోతాయి

పెదవుల పలుకులు ఆగిపోతాయి

గజ్జల సవ్వడి మానుకుంటుంది

నీ అందానికి చిందులు వేసే లేళ్ళు

తేళ్ళు వలె మారి సమస్త మానవాళిని సంహరిస్తాయి

కనుకనే కన్నిరు ఆపవే చెలి

కనులలోని చీకటిని కానీవు ఆవిరి

No comments:

Post a Comment