జాలువారే నా కంటి నీరు పలుకుతున్నవి,
హృదయంలో దాచుకున్న నీరూపం చెరగిపోదు అనే నిజాన్ని;
పలికే ప్రతి పలుకు వినాలనుకుంటుంది,
నిజమైన మన స్నేహానికి హద్దులు ఉండవు అనే నిజాన్ని;
వినే ప్రతి వచనం కోరుకుంటుంది,
ఏ జన్మకైనా మనం స్నేహితులుగానే జన్మించాలనే వాస్తవాన్ని;
నడిచే ప్రతి నడక వెనుదిరిగి వేడుకుంటుంది ,
ఎవ్వరువేరయినా నీ స్నేహం నన్ను వీడకూడదనే యదార్దాన్ని;
ఆలపించు నేస్తమా!
నా హృదయం చేసే ఈ స్నేహ సవ్వడిని...........
కలలు + కల్పనలు = నా కవితలు
ఆమెను చూసింది మొదలు
ఎడారి పాట నా చెవి లో సోకినా
ఈ క్షణం వరకు
నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక
పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో
పదిలపరిచాను .
నా సత్య స్వరుపమా !
బొమ్మలు వేయడం నా చేత కాదు .
చేతనైతే నా కలలను
నా మనోభావాలను
రంగుల చిత్రాల తో
ప్రదిర్శించే వాడిని
ఏ చిత్రకారున్ని
నేనశ్రాయుంచాను,
అందుకు నా మనస్సు సమ్మతించదు.
నా అంతరాత్మా !
ఇవిగో నా శబ్ద చిత్రాలు
నా మనస్సంగం లో
జనించిన ప్రాణ చిత్రలయున
ఏ "కలలు + కల్పనలు = నా కవితలు "
నీ పదాల చెంత ఉంచుతున్నాను .
-ముజీఫ్
No comments:
Post a Comment