అడుగు ముందు కేస్తే ఏ మవుతుందోనని ఆవేదనచెందకు,
నీ నీడ నీతో నేనున్నానంటుంది గమనించు;
కనే కలలు కన్నీరుగా మారుతాయేమోనని కలవరచెందకు,
జాలువారే నీ కన్నీటి కింద చిరునవ్వుల నిధి వుందని మరచిపోకు;
అలుపెరుగని నీఆశ ఆవిరైపోతందేమోనని అనుమానపడకు,
ఆ ఆశయాన్ని నెరవేర్చు అవకాశం కోసం మాత్రమే ఆరాటపడు;
పూర్వ జన్మ పాపాలు పగ తీర్చుకుంటాయేమోనని పశ్చాత్తాపపడకు,
ఆ పగ పనిపట్టే పట్టుదల నీకుందో లేదో పరిశీలించుకో...........
కలలు + కల్పనలు = నా కవితలు
ఆమెను చూసింది మొదలు
ఎడారి పాట నా చెవి లో సోకినా
ఈ క్షణం వరకు
నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక
పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో
పదిలపరిచాను .
నా సత్య స్వరుపమా !
బొమ్మలు వేయడం నా చేత కాదు .
చేతనైతే నా కలలను
నా మనోభావాలను
రంగుల చిత్రాల తో
ప్రదిర్శించే వాడిని
ఏ చిత్రకారున్ని
నేనశ్రాయుంచాను,
అందుకు నా మనస్సు సమ్మతించదు.
నా అంతరాత్మా !
ఇవిగో నా శబ్ద చిత్రాలు
నా మనస్సంగం లో
జనించిన ప్రాణ చిత్రలయున
ఏ "కలలు + కల్పనలు = నా కవితలు "
నీ పదాల చెంత ఉంచుతున్నాను .
-ముజీఫ్
No comments:
Post a Comment