కలలు + కల్పనలు = నా కవితలు

ఆమెను చూసింది మొదలు ఎడారి పాట నా చెవి లో సోకినా ఈ క్షణం వరకు నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో పదిలపరిచాను . నా సత్య స్వరుపమా ! బొమ్మలు వేయడం నా చేత కాదు . చేతనైతే నా కలలను నా మనోభావాలను రంగుల చిత్రాల తో ప్రదిర్శించే వాడిని ఏ చిత్రకారున్ని నేనశ్రాయుంచాను, అందుకు నా మనస్సు సమ్మతించదు. నా అంతరాత్మా ! ఇవిగో నా శబ్ద చిత్రాలు నా మనస్సంగం లో జనించిన ప్రాణ చిత్రలయున ఏ "కలలు + కల్పనలు = నా కవితలు " నీ పదాల చెంత ఉంచుతున్నాను . -ముజీఫ్

Saturday, July 17, 2010

*****మైత్రి****

చిరుగాలి తన మార్గాన్ని మర్చిపోతుందేమో  ?
కానీ
తనతో తిరిగే శ్వాసము మాత్రం విడువలేదు,
కోకిల తన గానాన్ని వదులుకుంటుందేమో?
కానీ
గారాల గోరింకను మాత్రం గుండెల్లో దాచుకుంటుంది,
ఆకాశం సరిహద్దు దాటి కనుమరుగవుతుందేమో ?
కానీ
పృద్విపై వున్న తన పరిచయాన్ని చినుకులతో పలకరిస్తుంది,
అలాగే
నేను మమకారాన్ని తలచి మరణాన్ని జయిస్తానేమోగాని,
ఈ మిత్రపై ఉన్న మైత్రిని మాత్రం ఎన్నటికి మరచిపోను

No comments:

Post a Comment