కలలు + కల్పనలు = నా కవితలు

ఆమెను చూసింది మొదలు ఎడారి పాట నా చెవి లో సోకినా ఈ క్షణం వరకు నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో పదిలపరిచాను . నా సత్య స్వరుపమా ! బొమ్మలు వేయడం నా చేత కాదు . చేతనైతే నా కలలను నా మనోభావాలను రంగుల చిత్రాల తో ప్రదిర్శించే వాడిని ఏ చిత్రకారున్ని నేనశ్రాయుంచాను, అందుకు నా మనస్సు సమ్మతించదు. నా అంతరాత్మా ! ఇవిగో నా శబ్ద చిత్రాలు నా మనస్సంగం లో జనించిన ప్రాణ చిత్రలయున ఏ "కలలు + కల్పనలు = నా కవితలు " నీ పదాల చెంత ఉంచుతున్నాను . -ముజీఫ్

Saturday, July 17, 2010

నీకు నాకు మద్య ఏమంత దూరం 
భావానికి భావుకతకి మద్య స్రుజనాత్మకతేగా    
ఆలోచనకి ఆచరణకి మద్యనున్న క్రుషియెగ   
మౌనానికి మాటకి మద్యనున్న మయమరుపేగ   
ఆశకి ఆశయానికి మద్యనున్న సంకల్పమెగ   
ఆచరణకి ఆస్వాదనికి మద్యనున్న అంతరమేగ 
బతకటానికి బతికేయటానికి మద్యనున్న అగాధమెగ  
మన మద్య ఉన్న ఈ దూరాలన్ని తొలగవా....    
అరె,
నువు(విజయం) నా కోసం రావా   
నువ్వు (విజయం)ఎదురైయ్యే క్షనాల కోసం 
ఇంకా ఎన్ని యుగాలు వేచి ఉండాలి......................

 

వర్షించే కనులను క్షణకాలం స్వేదతీర్చే చిరునవ్వును
కరిగే కలలను కనుపాపల మాటున నిలిపే కనులను
అనునిత్యం అంతర్మధన ఆహ్లదాన్ని బ్రోలే హుదయాన్ని............నేను ప్రేమిస్తున్నాను 
ప్రేమకు నిలయమైన వసుధైక కుటుంబ జీవన సౌందయాన్ని
తన చిరకాల వైరి ఓటమికైన చెలించగల మనసును  
మైత్రితో జగాన్ని జయించగలమనే నమ్మకాన్ని..........నేను ప్రేమిస్తున్నాను  
స్రమైక జీవన సాహచర్యంలో కంధిన ఆ కరములను  
విషాధ  నిశ్శబ్ధాన్ని చేధించే ఆ అడుగుల సవ్వడిని 
అప్తుల ఆనందానికై   అలసిసొలసిన   తలపులను   
ఆ...అడుగో 
రాగద్వెషాల  కూడలిలో అలుపెరుగక పయనించే 
అనురాగమనే భాటసారిని..........................  నేను ప్రేమిస్తున్నాను  

No comments:

Post a Comment