కలలు + కల్పనలు = నా కవితలు

ఆమెను చూసింది మొదలు ఎడారి పాట నా చెవి లో సోకినా ఈ క్షణం వరకు నేను...ఆమెతో ...తెలిసీ,తెలియక పంచుకున్న జ్ఞాపకాలను ఇందులో పదిలపరిచాను . నా సత్య స్వరుపమా ! బొమ్మలు వేయడం నా చేత కాదు . చేతనైతే నా కలలను నా మనోభావాలను రంగుల చిత్రాల తో ప్రదిర్శించే వాడిని ఏ చిత్రకారున్ని నేనశ్రాయుంచాను, అందుకు నా మనస్సు సమ్మతించదు. నా అంతరాత్మా ! ఇవిగో నా శబ్ద చిత్రాలు నా మనస్సంగం లో జనించిన ప్రాణ చిత్రలయున ఏ "కలలు + కల్పనలు = నా కవితలు " నీ పదాల చెంత ఉంచుతున్నాను . -ముజీఫ్

Saturday, July 17, 2010

చెప్పలేని ఎన్నో మాటలని చెప్పుకుంటున్న నా కవితల్లో...
తెలుపలేని ఎన్నో బావాలని పొందుపరుస్తున్న నా అక్షరాలలో...
మెప్పించే గొప్ప కవినీ కాకపోయినా, నా బావలను పదాలలో దాచాగాలిగిన రచయితను నేను...
చిత్రించే చిత్రకారుడిని నేను కాకపోయినా,  నీ రూపాన్ని కనురెప్పల్లో దాచాగాలిగిన కంటిపాపను నేను...
గుడికట్టి పుజించెంత ప్రేమ పిపాసిని కాకా పోయిన, ఎల్లవేళలా నిన్ను స్మరించే మీరని నేను...
--------------------------------------------------------------------------------------------------------------------
2.
తప్పుగా ఆలోచించాను - తప్పటడుగు వేసాను...
మనసు మాటవిన్నాను - జీవన విదానం మార్చాను...
కానీ...
నా ఆలోచనల్లో న్యాయం ఉంది..
నా మనసు మాటల్లో నిజాయితి ఉంది...
ప్రపంచానికి నేను తప్పుగా మిగిలి ఓడిన..
నా అంతరాత్మకు విజయమై గెలిచాను...
--------------------------------------------------------------------------------------------------------------------
3.
వెతుక్కుంటూ వస్తున్నాయి పదాలు, నీకై రాయటానికి...
ఉప్పెనై పొంగుతున్నాయి ఆలోచనలు, నీకై స్రమించటానికి...
వరదై పారుతున్నది కాలం,  నీకై దరిచేర్చటానికి...
నిశియై మారినది జీవితం, నీకై తలచినందుకు...
--------------------------------------------------------------------------------------------------------------------
4.
కవిలో బావం కవితైయితే...
మదిలో బావం నివే కద...
నాలో బావం నిదైతే...
నాలో కావివి నివేకద...
అంటే - 
రాసేది నేనైనా, రాయించేది నువ్వే...
కిర్తించేది నన్నైనా, అ కీర్తనల సవ్వడి నువ్వే..
నాలో అలజడి నువ్వే...
నాలో ప్రేరణ నువ్వే...
అన్ని నువ్వే.. అంత నువ్వే...
--------------------------------------------------------------------------------------------------------------------
5.
ఇన్నిన్ని బావలు నీకై పొందుపరుస్తున్న...
ఇన్నిన్ని అక్షరాలతో నిన్ను కీర్తిస్తున్న...
ఇన్నిన్ని పదాలతో నిన్ను పూజిస్తున్న...
ఇన్నిన్ని కవితలతో నా మనోబావలను తెలుపుతున్న..
ఇన్ని చేసిన నాకు, నీవేమి చేయగలవు...?
ఒక్క పదమై పలుకలేవ పెదవిపైన...
ఒక్క క్షణమైనా చూడలేవ కలమపైన...
ఒక్క గడిఅయినా ఒప్పుకోలేవ నది ఉహ కాదు నిజామని...
ఒక్క మాటైన చెప్ప్పలేవ నా ఉహకి మొదట ప్రాణం పోసింది నువ్వేనని...
ఇంతకన్నా నిన్నేమి అడగను...
ఇంతకు మించి నిదగ్గర ఏమి ఆశించాను...
నేను కోరేది ఒక్కటే... 
ఈ అలజడి.. 
నా కల్పనా కాదని, నివు కల్పిస్తే కలిగాయన్న 
నిజాం నివు ఒప్పుకోవాలని...
నా ఆలోచన తప్పుకాదని చిన్న ఆశ...
--------------------------------------------------------------------------------------------------------------------
6.
ఇంకా ఎన్నో సంగతులు చెప్పాలని ఉన్న, ఆపేస్తున్న మదిలో అలజడులని...
సుడిగుండమై, వరదలపొంగి, బుకంపంలా నన్ను - నా మనసుని చీల్చిన నీ ఆలోచనలకూ 
అంతం ఇవ్వాలని ఆపేస్తున్న...
ఆలోచనల్లో నిన్ను అంతమొందించిన...
నా మనసు పుటలలో నిగంటువై నిలిచిపోతావు...
నా పరిచయం నీ జీవితంలో ఓ తియ్యని అనుబుతి కావాలి...
నా ఆలోచనలు నీకు చేరిననాడు...
నేను నికింక కనిపించాను,
సూటిగా నిన్ను చూస్తూ...
నేను చేసింది తప్పో, ఒప్పో తెలియక తడబడుతూ వేల్లిపోలేను...
తప్పని తెలిస్తే ప్రశాంతంగా నిలవలేను...
నిజమని తెలిస్తే బ్రతకలేను...
అందుకే ఇన్ని అక్కరలతో నా మదిలో ప్రేమని తెలుపుతూ...
నీపై ఉన్న బావాలని, ఉహలని పదాలలో అల్లుకుంటూ, అక్షరసత్యమై నిలిపి విదిపోతున్నాను...
ఇది నా మనసు... నేను లేకున్నా... నివున్నంతవరుకు బద్రపరుచు...
ఇన్ని అసలు, ఉహాలు కలిగించింది నువ్వే...
నాది బ్రమైతే క్షమించి, బ్రన్తిలో బ్రతికుంటే మన్నించు...
ఏది అమైన...
అన్ని నింపిన మనసు పుస్తకంలో, నీకై ఒక్క పేజి మాత్రమే మిగిల్చాను...
అది ''నువ్వే'' నాపై బావలను నిజాయితిగా రాయటానికి ఇచ్చిన ఒక్క అవకాసం...
నీ బావలను రాస్తావో...
లేక నా జీవితంలాగే...
ఓ కాలిపేజిగా వదిలేస్తావో నీ ఇష్టం...
ఇట్లు...

మీ ముజీఫ్ 

No comments:

Post a Comment